ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో బుధవారం చోటుచేసుకుంది.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీశ్రీ రవిశంకర్ మరో నలుగురితో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా విపరీతమైన పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సత్యమంగళం టైగర్ రిజర్వ్‌లోని గిరిజన గ్రామం ఉకినియం వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. హెలికాప్టర్ ఉదయం 10:40 గంటలకు ల్యాండ్ అయింది. దాదాపు 50 నిమిషాల తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ బయలుదేరింది.