Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ : వెలుగులోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద క్షణాల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

ఒడిశా రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినదని పేర్కొంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో రికార్డు చేశారని చెబుతున్నారు. 

Odisha Train Accident: The video of the accident in Coromandel Express has come to light. It is viral on social media..ISR
Author
First Published Jun 8, 2023, 2:43 PM IST

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో పై ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ వీడియో రైలులోని ఏసీ కంపార్ట్మెంట్లలో ఒకదాంట్లో రికార్డు చేసినట్టుగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బోగీలో ఎవరో రికార్డు చేసిన వీడియో హఠాత్తుగా ముగిసిపోతుంది.

ముస్లిం దుకాణదారులు పట్టణం విడిచి వెళ్లాలి : ఉత్తర కాశీలో వెలసిన వివాదాస్పద పోస్టర్లు

ఈ వీడియోలో రైలు ప్రమాదం జరగడానికి ముందు.. రైల్వే సిబ్బంది కోచ్ ఫ్లోర్ ను శుభ్రం చేయడం, ఓ మహిళ తన సీటులో నిద్రపోవడం కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గందరగోళం, కేకలు వీడియోలో వినిపించాయి. ఈ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. కానీ ఇది ఒడిశా రైలు ప్రమాదానికి చెందినదా ? కాదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఒడిశాలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని కుటుంబాలకు వారి ఆత్మీయుల మృతదేహాలు అందలేదు. జూన్ 2 సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపుగా 288 మంది ప్రయాణికులు మరణించారు, వీరిలో 82 మంది గుర్తు తెలియనివారు ఉన్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం మిగతా మృతదేహాలను మృతుల కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు గురువారం తెలిపారు.

రెజ్లర్ల నిరసన లో ట్విస్ట్.. యూటర్న్ తీసుకున్న మైనర్ తండ్రి.. బ్రిజ్ భూషణ్ నా కూతురిని వేధించలేదంటూ వాంగ్మూలం

పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన పలువురు తమ కుటుంబ సభ్యుల మృతదేహం కోసం భువనేశ్వర్ ఎయిమ్స్ లో ఎదురుచూస్తున్నారు. కొన్ని మృతదేహాలను క్లెయిమ్ చేయడానికి ఎవరూ రాకపోవడం, అనేక కుటుంబాలు ఒకే మృతదేహాన్ని తమ ఆత్మీయులదే అని కోరుతున్నాయి. మృతదేహాల పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కూడా గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

జమ్మూలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన టీటీడీ వేంకటేశ్వర ఆలయం.. ప్రారంభించిన అమిత్ షా.. ప్రత్యేకతలేంటంటే ?

అయితే మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. మృతుల డీఎన్ఏ శాంపిల్స్ ను క్రాస్ వెరిఫికేషన్ కోసం న్యూఢిల్లీ ఎయిమ్స్ కు పంపించారు. రిపోర్టు వచ్చాక మృతదేహాలను నిజమైన హక్కుదారులకు అప్పగిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios