జమ్మూలో భక్తులకు అందుబాటులోకి వచ్చిన టీటీడీ వేంకటేశ్వర ఆలయం.. ప్రారంభించిన అమిత్ షా.. ప్రత్యేకతలేంటంటే ?
తిరుమల తిరుపతి దేవస్థానం జమ్మూలోని మాజీన్ ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వ ఆలయాన్ని నిర్మించింది. ఆ ఆలయాన్ని నేడు భక్తుల కోసం తెరిచారు. ఈ ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
జమ్మూకాశ్మీర్ లోని మాజీన్ ప్రాంతంలో అందమైన శివాలిక్ అడవుల మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామి వారి ఆలయాన్ని గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరయ్యారు.
చిన్న విషయాలకే తరచూ అవమానిస్తోందని భార్యపై కాల్పులు జరిపిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్.. ఎక్కడంటే ?
62 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయం జమ్మూ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా మారనుంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో మతపరమైన, తీర్థయాత్రా పర్యాటకాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రూ.30 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ నిర్మించిన జమ్మూలోని ఈ గుడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మించిన ఆరో శ్రీ వేంకటేశ్వర ఆలయం. మిగతా ఐదు ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో నిర్మించింది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనుంది.
జమ్మూ లో శ్రీ వేంకటేశ్వర్ ఆలయాన్ని భక్తుల కోసం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆలయం ఉన్న జమ్మూ- కత్రా మధ్య మార్గంలో ఈ ఆలయం ఉందని ఆయన చెప్పారు. అయితే భక్తుల కోసం ఆలయాన్ని తెరవడానికి కొన్ని రోజుల ముందు నుంచే (జూన్ 3 నుంచి) ఆలయంలో అవసరమైన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడే ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. తిరుమలలో అనుసరిస్తున్న విధానం, ఆచారాన్ని జమ్మూ ఆలయంలో కూడా అనుసరిస్తామన్నారు. ఈ పవిత్ర స్థలంలో తిరుపతి బాలాజీ ఆలయాన్ని టీటీడీ నిర్మించిందని తెలిపారు. కాగా.. ఆ ఆలయ ప్రాంగణంలో టీటీడీ ప్రధాన ఆలయ సముదాయంతో పాటు ఉపాలయాలు, పోటు కిచెన్ ఏరియా, అన్నప్రసాదం కౌంటర్లు తదితరాలను నిర్మించింది.