చండీగఢ్: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన ఓ హత్య కేసులో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తూ వస్తున్నారు. ఓ హోటల్ గదిలో మణీందర్ సింగ్ అనే 31 ఏళ్ల యువకుడు నర్సును హత్య చేశాడు. అతని కోసం చండీగఢ్ పోలీసులు గాలిస్తూ వచ్చారు. 
చివరకు మంగళవారంనాడు అతను ఓ టీవీ లైవ్ షోలో తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో పోలీసులు హుటాహుటిన ఆ పంజాబీ టీవీ చానెల్ కు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో జనవరి 1వ తేదీన సరబ్ జీత్ కౌర్ అనే యువతి హత్యకు గురైనట్లు సమాచారం అందింది. 

డిసెంబర్ 30వ తేదీన మణీందర్ అనే యువకుడు గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తేల్చుకున్నారు. అదే గదిలో యువతి శవమై కనిపించింది. దాంతో మణీందర్ కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు.

Also Read: హెచ్ఓడీతో బీటెక్ విద్యార్థిని రాసలీలలు.. వీడియో లీకవ్వడంతో

మంగళవారంనాడు అకస్మాత్తుగా మణీందర్ సింగ్ ఓ పంజాబీ టీవీ చానెల్ కార్యాలయానికి వచ్చాడు. తాను చేసిన హత్య గురించి లైవ్ షోలో చెప్పేశాడు. ఆ యువతి తన గర్ల్ ఫ్రెండ్ అని, ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించి ఈ హత్య చేసినట్లు తెలిపాడు. మణీందర్ 2010లో జరిగిన ఓ యువతి హత్య కేసులోనూ నిందితుడు. అతను బెయిల్ పై వచ్చి నర్సును హత్య చేశాడు.

డిసెంబర్ 30వ తేదీన మణీందర్ సింగ్ తో పాటు సరబ్ జీత్ కౌర్ హోటల్ గదికి వచ్చింది. అదే సాయంత్రం మణీందర్ సింగ్ హోటల్ గది నుంచి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. గదిని రెండు రోజుల కోసం మాత్రమే బుక్ చేసుకోవడంతో ఖాళీ చేసే విషయాన్ని కనుక్కోవడానికి హోటల్ సిబ్బంది గదికి వెళ్లడంతో హత్య విషయం వెలుగు చూసింది. 

సరబ్ జీత్ గతంలో మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసింది. బతిండాలోని ఎయిమ్స్ లో ఇటీవలే ఆమెకు ఉద్యోగం వచ్చింది. పీజీఐఎంఈఆర్ లో కొద్ది రోజుల పాటు ఆమె శిక్షణ తీసుకోవాల్సి ఉండింది.

మూడు నెల క్రితం వరకు మణీందర్ సింగ్ పారిశ్రామికవాడలోని రెండో ఫేజ్ లో గల ఓ ఫ్యాక్టరీలో డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చాడు. ఇరువురి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. దాంతో తరుచుగా ఆ  హోటల్ వస్తుండేవారు. 

Also Read: మహిళ తో ప్రేమ.. మేనకోడలిపై అత్యాచారం.. గర్భం రావడంతో...

బావతో అఫైర్ పెట్టుకుంది కాబట్టి ఆమెను తాను చంపేశానని మణీందర్ టీవీ లైవ్ షోలో చెప్పాడు. అందుకు సంబంధించిన వివరాలను కూడా అతను టీవీ లైవ్ షోలో చెప్పాడు. 

కర్నాల్ లో తనతో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళను చంపినందుకు 2010లో మణీందర్ ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో బెయిల్ పొంది అతను బయటకు వచ్చాడు. గొడవ జరగడంతో తాను రేణును చంపినట్లు కూడా అతను అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తితో అఫైర్ పెట్టుకున్నందుకు ఆమెను హత్య చేసినట్లు చెప్పాడు.