ఓ వ్యక్తి... ప్రేమ పేరిట  ఓ  యువతికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు. అతను చెప్పినందతా నిజమని ఆమె నమ్మేసింది. దీంతో... అతనికి శారీరకంగా దగ్గరయ్యింది. పలు మార్లు ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు తెలియకుండా... ఆమెతో గడిపిన సమయంలో... దానంతటినీ వీడియోలు తీశాడు.  ఆ వీడియోలు సదరు మహిళ మేనకొడలుకి చూపించడం మొదలుపెట్టాడు. 

తనతో గడపకపోతే.. మీ అత్త వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ బెదిరించి.. సదరు బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది.

Also Read ఆవు వర్థంతికి హాజరైన మహిళా మంత్రి.. సంచలన కామెంట్స్...

పూర్తి వివరాల్లోకి వెళితే...  అస్సాం కి చెందిన అజ్మల్ లష్కర్ అలియాస్ ఆషిష్ దుబే(26) బతుకు తెరువు కోసం ముంబయి కి వచ్చాడు. చిన్నా చితక పనులు చేసుకునే అతనికి... ఓ మహిళ(23) పరిచయం అయ్యింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. ఆమెతో పలుమార్లు శృంగారంలో పాల్గొని... దానంతటినీ వీడియో తీశాడు. 

సదరు మహిళకు ఓ మేనకోడలు ఉంది. ఆమె వయసు 17 సంవత్సరాలు. అయితే... అజ్మల్ కన్ను... ఈ బాలికపై కూడా పడింది. ఆమె అత్తకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి... బాలికను కూడా లోబరుచుకున్నాడు. ఇప్పుడు బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మోసపోయినట్లు గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారిద్దిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.