హెచ్ఓడీతో ఓ విద్యార్థిని రాసలీలు జరిపిందని... ఆ వీడియో లీక్ అవ్వడంతో మానసికంగా కృంగిపోయి.. సదరు విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలోని ఓమలూరులోని పెరియార్ యూనివర్శిటీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని హాస్పటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాను ఉండే హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. గమనించిన ఆమె స్నేహితులు వెంటనే హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించారు. 

Also Read తల్లి రెండో పెళ్లి... రూ.కోటిన్నర ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన కొడుకు.

వార్డెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సేలం డిప్యుటీ  కమిషనర్ తంగదురై, అసిస్టెంట్ కమిషనర్ సెల్వరాజ్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని విచారణ జరిపారు. సదరు యువతి మృతదేహం వద్ద  మూడు పేజీల సూసైడ్ నోట్ లభించింది. దీని ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే... యువతి ఆత్మహత్యకు ముందు ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారిందని సమాచారం. తమ కాలేజీ హెచ్ ఓడీతో రాసలీలు జరుపుతుండగా తీసిన ఓ వీడియో వైరల్ కావడం వల్లే ఆత్మహత్య చేసుకుందనే వాదనలు వినపడుతున్నాయి. అయితే... నిజంగా ఆ వీడియోలో ఉన్నది సదరు యువతి అవునో.. కాదో తెలియాల్సి  ఉందని పోలీసులు చెబుతున్నారు.