Asianet News TeluguAsianet News Telugu

నిన్న ఢిల్లీ అల్లర్లు, నేడు మర్కజ్: అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్... అజిత్ దోవల్

నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న వారందరిని ఖాళీ చేపించేటప్పుడు గొడవయితదని అందరు అనుకున్నారు. కాకపోతే... పోలీసులు ఎటువంటి ఫోర్స్ వాడకుండానే అందులోని వారంతా బయటకు రావడానికి అంగీకరించి టెస్టులకు కూడా ముందుకొచ్చారు. 

NSA Ajit Doval, the man behing getting the Markaz premises vacated
Author
New Delhi, First Published Apr 1, 2020, 4:10 PM IST

కరోనా వైరస్ అనే పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికి పోతుంది. ఆ మహమ్మారి భయానికి ప్రపంచమంతా ఇండ్లలోనే ఉండిపోయి లాక్ డౌన్ పాటిస్తున్నారు. మనదేశంలో ఇప్పుడిప్పుడే వైరస్ ప్రబలుతోంది. దానికి అడ్డుకట్ట వేయడానికి మన దేశం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. 

కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలో కంట్రోల్ లోనే ఉంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు హాజరయినవారిలో చాలామంది కరోనా పాజిటివ్ లు గా తేలడం, వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండడం ఇప్పుడు భయానక వాతావరణానికి కారణమవుతుంది. 

వీరంతా ఢిల్లీ నుండి వెళ్ళేటప్పుడు వైరస్ బారినపడి తెలియకుండా రకరకాల రవాణా సదుపాయాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వారిలో ఇప్పుడు వైరస్ లక్షణాలు బయటపడడమే కాకుండా వారిప్పుడు వారి ఊర్లలో అనేకమందితో కలిశారు. వారందరు కూడా ఇప్పుడు కరోనా వైరస్ బారినపడే ప్రమాదముంది. 

ఇలా నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న వారందరిని ఖాళీ చేపించేటప్పుడు గొడవయితదని అందరు అనుకున్నారు. కాకపోతే... పోలీసులు ఎటువంటి ఫోర్స్ వాడకుండానే అందులోని వారంతా బయటకు రావడానికి అంగీకరించి టెస్టులకు కూడా ముందుకొచ్చారు. 

ఇంత తేలికగా ఇదంతా ఎలా జరిగిందని అందరూ భావిస్తున్న సమయంలోనే అసలు విషయం తెలిసివచ్చింది. ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ తబ్లిగ్ సంస్థ ప్రతినిధులతో నిరంతరం టచ్ లో ఉన్నాడట. ఆయన స్క్రీన్ మీద కనపడకపోయినా ఆ సంస్థ ప్రతినిధులతో నిరంతరం ఫోన్ లో టచ్ లో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాడట. 

గత కొంత కాలంగా ఆయన ఆ సంస్థ ప్రతినిధులతో నెరుపుతున్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు సమయానికి అక్కరవచ్చాయని అధికారులు అంటున్నారు. గతంలో ఢిల్లీ అల్లర్లప్పుడు కూడా అజిత్ దోవల్ స్క్రీన్ మీదకు వచ్చిన తరువాతే అల్లర్లు కంట్రోల్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 

అజిత్ దోవల్ హోమ్ మంత్రి అమిత్ షా కి కాకుండా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేస్తారు. ఆయన ఢిల్లీ అల్లర్లప్పుడు కూడా పోలీసులు మేము వెళ్లలేము అన్న సందుల్లోకి తెల్లారి ఉదయం కల్లా ప్రవేశించి వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు వైరస్ తక్కువగా వ్యాప్తి చెందిందిన్ అనుకుంటున్న తరుణంలో మన రాష్ట్రంలో కూడా కరాళ నృత్యం చేస్తుంది.  రెండు రోజులుగా ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి నుండే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందనే అభిప్రాయంతో అధికార వర్గాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకొంది. కేవలం 12 గంటల్లోనే 43 కరోనా పాజిటివ్ కేసులు  నమోదైనట్టుగా రిపోర్టులు తెలుపుతున్నాయి.  ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వచ్చినవారి నుండే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

also read:ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి.373 శాంపిళ్లను ల్యాబ్ కు పంపారు. వీటిలో 43 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ప్రకాశం జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి కొడుకుకు కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా  వైద్యులు  ప్రకటించారు.

మార్చి 31వ తేది రాత్రి 9 గంటల నుండి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిజాముద్దీన్ ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛంధంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం బుధవారం నాడు కోరింది. మరో వైపు ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు, కుటుంబసభ్యులకు కూడ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios