Asianet News TeluguAsianet News Telugu

నేను ఇప్పుడు చిన్న పాపను కాదు.. అడల్ట్‌ను: శ్రద్ధా వాకర్ చివరి మాటలు వెల్లడించిన తండ్రి

శ్రద్ధా వాకర్ చివరి సారి అన్న మాటలను తండ్రి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉద్వేగంతో రివీల్ చేశారు. తానిప్పుడు చిన్న పిల్లను కాదని, అడల్ట్ అని పేర్కొందని వివరించారు. ఇప్పటికీ తనకు ఓ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదని అన్నారు.
 

now iam an adult shraddha walkar told to her father before leaving her home
Author
First Published Dec 9, 2022, 6:00 PM IST

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె హత్య, ఇల్లు వదిలిపోవడానికి సంబంధించిన విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ విలేకరుల ముందు కీలక విషయాలను వెల్లడించారు. తన కూతురు శ్రద్ధా వాకర్ ఇల్లు వదిలి వెళ్లిపోయేటప్పుడు చివరి మాటలు ఏమన్నదో వివరించారు. తనకు అర్థం కానీ, లేదా అనుమానిస్తున్న విషయాలనూ ప్రస్తావించారు.

‘18 ఏళ్లు నిండిన వారిపైనా కౌన్సెలింగ్, కంట్రోల్ అనేది ఉండాలి. నా బిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోయేటప్పుడు ‘నేను ఇప్పుడు చిన్న పాపను కాదు.. అడల్ట్‌ను’ అని పేర్కొంది. ఈ మాట అన్నతర్వాత నేను ఇక ఏదీ మాట్లాడలేకపోయాను’ అని వికాస్ వాకర్ ఉద్వేగంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు.

18 ఏళ్లు, అంతకు చిన్నవారిపై మరింత నియంత్రణ అవసరం ఉంటుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన తర్వాత వచ్చే స్వేచ్ఛ గురించీ మరికొన్ని ఆలోచనలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, గందరగోళం సృష్టించే కొన్ని మొబైల్ యాప్స్ (డేటింగ్ యాప్స్) పైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అఫ్తాబ్ అమీన్‌ను శ్రద్ధా వాకర్ బంబుల్ డేటింగ్ యాప్‌లో కలిసింది.

Also Read: శ్రద్ధాను 35 ముక్కలుగా చేస్తే.. నేను నిన్ను 70 ముక్కలుగా నరుకుతాను - మహారాష్ట్రలో మరో యువతికి బెదిరింపులు

అఫ్తాబ్ అమీన్‌కు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని, శ్రద్ధా వాకర్ శరీర భాగాలు ఇంటిలో ఉన్నప్పుడే ఆయన ఈ యాప్ ద్వారా ఎంత మందిని కలిశారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు బంబుల్ యాప్‌కు ఓ లేఖ రాశారు. 

ప్రస్తుతం జరుగుతున్న ముంబయి పోలీసుల దర్యాప్తుపై తాను సంతృప్తిగా ఉన్నట్టు వివరించారు. కానీ, ముందుగానే ముంబయి పోలీసులు స్పందించి ఉంటే తన కూతురు బతికేదని అన్నారు.

చివరి సారి తాను 2021లో తన బిడ్డతో మాట్లాడినట్టు వివరించారు. ఆమె ఎక్కడ ఉన్నది అనే వివరాల గురించి మాట్లాడానని,  ఆమె బెంగళూరులో నివసిస్తున్నట్టు తెలిపిందని తెలిపారు. సెప్టెంబర్ 26న తాను అఫ్తాబ్‌కు ఫోన్ చేశానని, తన బిడ్డ గురించి ఆరా తీస్తే ఏ సమాధానమూ చెప్పలేదని వివరించారు.

Also Read: నా కుమార్తెను చంపిన అఫ్తాబ్ పూనావాలాను ఉరి తీయాలి - శ్రద్ధా వాకర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

అయితే, తాను ఒక సమాధానం కోసం ఇంకా వెతుకుతున్నారని తెలిపారు. ఆమె తిరిగి ఇంటికి రాకుండా ఉండటానికి ఎలాంటి ఒత్తిడి పెట్టారనే విషయం ఇంకా తెలియరాలేదని వివరించారు. ఆమె చాలా కష్టంగా ఫోన్ కాల్స్, మెస్సేజీలకు స్పందించేదని తెలిపారు. తల్లిదండ్రులతో అసలే ఉండకూడదని ఆమెను అఫ్తాబ్ ప్రిపేర్ చేశాడని అన్నారు. అందుకే తమ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు తనతో మాట్లాడలేదని వివరించారు. తాను వారి మధ్య సంబంధాన్ని వ్యతిరేకించానని చెప్పారు. తన బిడ్డ ఇంటికి రాకుండా ఉండటానికి అఫ్తాబ్ మీనన్ బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడని ఆరోపణలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios