Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధాను 35 ముక్కలుగా చేస్తే.. నేను నిన్ను 70 ముక్కలుగా నరుకుతాను - మహారాష్ట్రలో మరో యువతికి బెదిరింపులు

సహజీవనం చేస్తున్న తన భాగస్వామిపై యువకుడు క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను చిత్రిహింసలకు గురి చేశాడు. శ్రద్ధావాకర్ ను 32 ముక్కలుగా నిరికితే.. తాను 70 ముక్కలుగా నరుకుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహారాష్ఠ్రలో జరిగింది. 

If you cut Shraddha into 35 pieces.. I will cut you into 70 pieces - Another girl in Maharashtra gets threats
Author
First Published Dec 3, 2022, 12:08 PM IST

శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటన మరక ముందే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఢిల్లీలోనూ  ఇలాంటి దారుణం ఒకటి వెలుగు చూసింది. అయితే తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రియుడు తన ప్రియురాలిని శ్రద్దా తరహాలోనే హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు వినకపోతే 70 ముక్కలుగా నరికేస్తానని బెదిరించాడు. వారిద్దరూ కొంత కాలంగా సహ జీవనం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎక్కడికి వెళ్లినా భారత్ ను నాతో తీసుకెళ్తాను - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్

యువతి ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలికి గతంలోనే వివాహం జరిగింది. 2017లో ఆమెకు ఒక బిడ్డ జన్మించింది. అయితే ఆమె భర్త 2019లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆమెకు హర్షల్ మాలి అని పిలిచే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు బాధితురాలని ధూలేలోని లాలింగ్ గ్రామంలోని అడవికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరించాడు. 

టీఎంసీ నేత ఇంట్లో భారీ పేలుడు.. ఇద్దరు కార్యకర్తల మృతి

తరువాత ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కోసం అఫిడవిట్ సిద్ధం చేయడానికి 2021 జూలైలో వారు అమల్నేర్‌కు వెళ్లారు. అక్కడ అతడి అసలు పేరు హర్షల్ మాలీ కాదని అర్షద్ సలీం మాలిక్ అని యువతికి తెలిసింది. అనంతరం ఆమెను ఉస్మానాబాద్‌లోని ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చాడు. అంతకు ముందే ఉన్న బిడ్డ మతం కూడా మార్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మాలిక్ తండ్రి కూడా ఆమెను దుర్భాషలాడాడు.

తాను చెప్పిన సర్ఫ్ భర్త తేలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య...!

నాలుగు నెలల తర్వాత ఆ మహిళను ధూలేలోని విట్టా భట్టి ప్రాంతంలోని ఓ ఇంటికి మాలిక్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఈ ఏడాది ఆగస్టు 26న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో కూడా అర్షద్ మాలిక్ ఆమె వేధింపులు చేస్తూనే ఉన్నాడు. ఓ సందర్భంలో బాధితురాలి అతడికి ఎదురుచెప్పడంతో సైలెన్సర్‌తో చర్మం కాలిపోయేలా కాల్చాడు.

సహజీవనం చేస్తున్న మహిళ ముఖం చిధ్రం చేసి, గొంతుకోసి చంపిన వ్యక్తి.. చిటికెన వేలు నరికి..

ఇటీవల పలు సందర్భాల్లో ఆమె అతడి ఇష్టాలకు వ్యతిరేకించిన సమయాల్లో కూడా వేధింపులకు పాల్పడ్డాడు. శ్రద్ధావాకర్ తరహాలోనే హత్య చేస్తానని బెదిరించాడు. ‘‘శ్రద్ధాను 35 ముక్కలుగా చేశాడు. కానీ నేను నిన్ను 70 ముక్కలుగా నరికేస్తాను’’ అని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన సహజీవన భాగస్వామి అర్షద్ సలీం మాలిక్ తనను వేధిస్తున్నాడని నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios