Asianet News TeluguAsianet News Telugu

నా కుమార్తెను చంపిన అఫ్తాబ్ పూనావాలాను ఉరి తీయాలి - శ్రద్ధా వాకర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

శ్రద్ధా వాకర్ ను దారుణంగా హత్య చేసిన పూనావాలాను ఉరి తీయాలని బాధితురాలి తండ్రి వికాస్ వాకర్ అన్నారు. తన కూతురు ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే ఆమె ఇప్పటికీ బతికే ఉండేదని తెలిపారు. 

Aftab Poonawala who killed my daughter should be hanged - Shraddha Walker's father's sensational comments
Author
First Published Dec 9, 2022, 5:03 PM IST

తన కుమార్తె హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ పూనావాలాను ఉరితీయాలని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయిన అనంతరం వికాస్ వాకర్ ముంబైలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమార్తెను చంపిన అఫ్తాబ్ పూనావాలాకు ఉరిశిక్ష వేయాలి. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. 

కాంతారా సినిమా చూసేందుకు వచ్చిన ముస్లిం దంపతులపై యువకుల దాడి.. ఎక్కడంటే ?

శ్రద్ధా ఫిర్యాదుపై దర్యాప్తును ఆలస్యం చేసినందుకు వాసై, నలసోపారా, తులింజ్ పోలీసులపై కూడా విచారణ జరిపించాలని వికాస్ వాకర్ అన్నారు. వారు సరైన సమయంలో చర్యలు తీసుకుంటే తన కూతురు ఇప్పుడు జీవించి ఉండేదని తెలిపారు. ఢిల్లీ గవర్నర్, ఢిల్లీ సౌత్ డీసీపీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ లు తన కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని మొబైల్ యాప్ లపై ‘‘మతపరమైన అవగాహన’’ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం దర్యాప్తు బాగానే ఉంది. అయితే ఇంతకు ముందు వాసాయిలోని తులింజ్ పోలీసులు సహకరించలేదు. వారు సహకరించి ఉంటే నా కుమార్తె బతికి ఉండేది’ అని తెలిపారు.

గోవా జైలు నుంచి తప్పించుకుని 15 ఏళ్ల తర్వాత హోటల్‌లో చిక్కాడు.. అక్కడ ఏం చేస్తున్నాడంటే?

అఫ్తాబ్ వాకర్ ను కఠినంగా శిక్షించాలని, అతని కుటుంబం, బంధువులపై కూడా దర్యాప్తు చేయాలని వికాస్ వాకర్ అధికారులను కోరారు.‘శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ పూనావాలాల సంబంధానికి నేను వ్యతిరేకిని. శ్రద్ధాకు అఫ్తాబ్ ద్వారా గృహ హింస కు గురయ్యిందని నాకు తెలియదు.కానీ అతడి కుటుంబ సభ్యులకు అన్నీ తెలుసని నేను భావిస్తున్నాను.’ అని తెలిపారు. ‘18 ఏళ్లు నిండిన తర్వాత వ్యక్తులకు ఇచ్చే స్వేచ్ఛ విషయంలో మనం ఆలోచించాలి. కొన్ని యాప్స్ లో మతపరమైన అవగాహన కూడా ముఖ్యం’ అని పేర్కొన్నారు.

కాగా.. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి లో శ్రద్ధా వాకర్ హత్య జరిగింది. అయితే అది ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా శ్రద్దాను గొంతు నులిమి 35 ముక్కలుగా కోసి 300 లీటర్ల ఫ్రిజ్ లో దాదాపు మూడు వారాల పాటు ఉంచాడని ఆరోపణలు ఉన్నాయి.

కాలేజీ ఈవెంట్‭లో కలకలం.. బుర్ఖా వేసుకుని డాన్స్ చేసిన అబ్బాయిలు.. యాజమాన్యం ఏం చేసిందంటే..?

అయితే శ్రద్ధా వాకర్ నవంబర్ 2020 లో తులింజ్ పోలీసులకు పూనావాలాపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించింది. అందులో అఫ్తాబ్ తనను దూషిస్తున్నాడని, కొడుతున్నాడని పేర్కొంది. తనకు ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతడు తనను బెదిరిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ముక్కలుగా కోసి విసిరేస్తానని హెచ్చరిస్తున్నాడని పేర్కొంది. కానీ తనకు పోలీసుల వద్దకు వెళ్లే ధైర్యం లేదని ఆ లేఖలో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios