Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మద్దతు లేకుండా హింసాత్మక ఘటనలు జరగవు - సరిహద్దు వివాదంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర - కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. బెలగాలిలో మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం వ్యాఖ్యలు చేశారు. 

No violence without Delhi's support - Sanjay Raut's sensational comments on border dispute
Author
First Published Dec 7, 2022, 2:47 PM IST

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం విషయంలో శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్దతు లేకుండా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం లేదని ఆరోపించారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకొని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై కూడా రౌత్ విరుచుకుపడ్డారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడంలో రాష్ట్రం బలహీనంగా కనిపిస్తోందని అన్నారు.

విప్లవాత్మక అడుగు.. సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభించిన సీజేఐ

‘‘ ఢిల్లీ మద్దతు లేకుండా బెలగావిలో మరాఠీ ప్రజలు, మహారాష్ట్రకు చెందిన వాహనాలపై దాడి చేయలేరు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను అరెస్టు చేశారు. మరాఠీ ఆత్మగౌరవాన్ని వెన్నెముక బద్దలు కొట్టి అంతం చేసే ఆట మొదలైంది. బెళగావిలో దాడులు కూడా అదే కుట్రలో భాగమే. లేవండి మరాఠాలు లేవండి ’’అని పేర్కొన్నారు.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్ విజయం...

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తాను విప్లవాన్ని సృష్టించానని చెబుతున్నారని, కానీ దాడులను ఎదుర్కోవడానికి రాష్ట్రం ఎంత బలహీనంగా కనిపిస్తోందో చూస్తే అది ఎలాంటి విప్లవమో తెలుస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. తమకు ఆత్మగౌరవం ఉందని చెప్పి శివసేనను వీడిన వారు ఇప్పుడు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. 

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం.. కాసేపట్లో మీడియా ముందుకు కేజ్రీవాల్..

ఈ సందర్భంగా బుధవారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. బెలగావిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ నాయకత్వంలో బెలగావికి వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాగా.. సరిహద్దు వివాదంపై ఇరు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మంగళవారం రాత్రి ఫోన్ లలో సంభాషించారు.

విశ్వాసఘాతకుడు అంటూ అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు.. బాధపడ్డానన్న సచిన్ పైలట్

అలాగే మహారాష్ట్ర నుంచి దక్షిణాది రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై రాళ్లు రువ్వడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మంగళవారం బొమ్మైతో మాట్లాడారు. సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య మహారాష్ట్ర మంత్రుల ప్రతినిధి బృందం మంగళవారం కర్ణాటకలోని బెలగావిలో ప్రతిపాదిత పర్యటన కార్యరూపం దాల్చలేదు. అయితే మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పోలీసు సలహాను ఉటంకిస్తూ కర్ణాటకకు బస్సు సేవలను నిలిపివేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios