Delhi air pollution : దేశ రాజ‌ధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అదిపెద్ద స‌మ‌స్య‌గా మారింది. వాయు కాలుష్యం నివారించడానికి ఢిల్లీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే.. గ‌త రెండు రోజులుగా గాలి నాణ్య‌త స్థాయి పెరిగింద‌ని SAFAR) పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో గాలినాణ్య‌త మ‌రింత పెరిగే అవ‌కాశముంద‌ని తెలిపింది. 

Delhi air pollution: భారత్ లో గాలి కాలుష్యం పెరిగిపోతోంది. మ‌రి ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మృత్యుఘంటికలు మోగిస్తోంది. కాలుష్యం కన్నీరు పెట్టిస్తోంది. ప్రాణవాయువు విషాన్ని చిమ్ముతోంది. బయట గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. అయితే.. ఇటీవ‌ల కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న ప‌లు క‌ఠిన‌ చ‌ర్య‌లు, వాతావ‌ర‌ణ మార్పులు ఫ‌లితంగా .. గాలి నాణ్యత కాస్త మెరుగుబ‌డింది. తీవ్ర గాలి కాలుష్య నాణ్య‌త‌ నుంచి అతి పేల‌వ‌మైన గాలి కాలుష్య నాణ్య‌త‌కు చేరుకుంద‌ని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 337 గా న‌మోదైంద‌ని System of Air Quality and Weather Forecasting And Research (SAFAR) పేర్కొంది. 

సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం,.. దేశ రాజధాని ఢిల్లీ లో గాలి నాణ్య‌త అతిపేలవమైన నాణ్యతతో కొనసాగుతుంద‌ని, గురువారం ఉదయం మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 337 వద్ద ఉందని తెలిపింది. గాలి వేగం ఎక్కువగా వీచే అవకాశం ఉన్నందున శుక్రవారం నుండి గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

Read Also; కోల్‌కతా దుర్గా పూజా వేడుకలకు యునెస్కో గుర్తింపు.. ప్రతి భారతీయుడికి గర్వకారణం: ప్రధాని

గురువారం మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు గాలి సాంద్ర‌త‌లో చాలా వ్య‌త్యాసాలు క‌నిపించాయ‌ని, వరుసగా 'వెరీ పూర్'లో 168 మరియు 'పూర్ ' కేటగిరీలో 284 వద్ద ఉన్నాయని SAFAR తెలిపింది. నేడు 'చాలా పేలవమైన స్థాయిలో గాలి నాణ్యతను ఉంద‌ని పేర్కొంది. రాబోయే మూడు రోజులుగా ఢిల్లీలో గాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి గాలుల తీవ్రత కారణంగా గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని, గాలి నాణ్య‌త పూర్ (poor) లేదా లోయర్ ఎండ్ ఆఫ్ వెరీ పూర్ (lower end of very poor )` కేటగిరీలో ఉండ‌బోతున్న‌ట్టు సఫర్ బులెటిన్‌లో పేర్కొంది. నోయిడా మరియు గురుగ్రామ్‌లలో గాలి నాణ్యత కూడా వరుసగా 337 నుంచి 330 మ‌ధ్య గాలి నాణ్య‌త ఉన్న‌ట్టు తెలిపింది. 

Read Also: ఇక ఓటర్ కార్డులకు ఆధార్ సీడింగ్.. ప‌లు కీల‌క ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌..

దేశం గాలి కాలుష్యం అతి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా ఢిల్లీని గాలి కాలుష్యం పట్టి పీడిస్తున్నది. వాయు కాలుష్యం నివారించడానికి ఢిల్లీ సర్కారు చేయని ప్రయ‌త్నాలేవు. గ‌త నెల‌లో స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ అండ్ గ్రీన్ పీస్ సౌత్ ఈస్ట్ ఏషియా అధ్యయనం ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా 2020లో 54,000 మంది మరణించారు. 

అనంత‌రం.. ఈ విష‌యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చాలా సీరియ‌స్ గా తీసుకున్నాయి. ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. గ్యాస్ సంబంధిత పరిశ్రమ మినహా మిగిలిన అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ.. ఇటీవ‌ల ఇచ్చిన కొన్ని స‌ద‌లింపుల వ‌ల్ల ఢిల్లీలో కాలుష్య స్థాయిలు పెరిగింది.

Read Also; చరిత్రలో తొలిసారి.. సూర్యుడిని తాకిన‌ నాసా అంతరిక్ష నౌక.. మూడేళ్ల తర్వాత..

ప్రభుత్వ ఏజెన్సీల ప్రకారం.. సున్నా నుండి 50 మధ్య గాలి నాణ్యత సూచి ఉంటే నాణ్యత బాగా ఉన్నట్టు అర్ధం. 51 మరియు 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని , 101 మరియు 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 మరియు 300 ఉంటే చాలా తక్కువ నాణ్యత ఉన్నట్టుగా, 301 మరియు 400 'చాలా పేలవమైనది' మరియు 401 మరియు 500 కు వస్తే ప్రమాదకరస్థాయి అని సూచన.