Asianet News TeluguAsianet News Telugu

Amravati Murder : ఫార్మసిస్టు హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యమేం లేదు - సీపీ ఆర్తి సింగ్

అమరావతిలో వెలుగులోకి వచ్చిన  ఫార్మసిస్టు హత్య కేసులో పోలీసులు ఎలాంటి నిర్లక్షమూ వహించలేదని స్థానిక పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 గురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. 

No police negligence in Amravati pharmacist murder case - CP Arti Singh
Author
Mumbai, First Published Jul 4, 2022, 4:49 PM IST

ఉమేష్ కోల్హే దారుణ హత్యపై పోలీసుల నిర్లక్ష్యం లేదని అమరావతి పోలీస్ కమిషనర్ (సీపీ) ఆర్తి సింగ్ అన్నారు. కుటుంబ సభ్యులు ఎలాంటి బెదిరింపుల గురించి ప్రస్తావించలేదని ఆమె ‘టైమ్స్ నౌ’ తో తెలిపారు. కాగా గ‌తంలో నుపూర్ శర్మకు మద్దతుగా మృతుడు ఏవైనా వాట్సాప్ సందేశాలు పంపారా అని జూన్ 11న పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులను అడిగారని కుటుంబం తెలిపింది. దీనిపై సీపీ స్పందించి మాట్లాడారు..అకాల అంచనాలు వేయకూడదని, సమాజంలో అశాంతి సృష్టించకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ విష‌యాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. వాట్సాప్ సందేశాలకు, అత‌డి హత్యతో సంబంధం ఉందని పేర్కొనలేదని చెప్పారు.

శివ‌సేన నాయ‌కుడు సంజయ్ రౌత్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ.. ఏ కేసులో అంటే ?

అమరావతిలో పలుమార్లు ఈ బెదిరింపులపై ఫిర్యాదులు వ‌చ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్ర‌శ్న‌కు ఆయ‌న సమాధానమిస్తూ.. బెదిరింపులకు సంబంధించి తమకు మూడు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని, అందులో ఇద్దరు వ్యక్తులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదని అన్నారు. ఒక రాత‌పూర్వ‌క ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామ‌ని చెప్పారు. 

కాగా ఉమేష్ కోల్హే హత్య కేసులో ప్రాథమిక నిందితుడు ఉపయోగించిన హత్యాయుధం, మోటార్ బైక్ ను పోలీసులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం అమరావతిలోని లాల్ ఖాదీ ప్రాంతంలోని అడవిలో ఈ బైక్ దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇర్ఫాన్ షేక్ రహీమ్, ముదస్సిర్ అహ్మద్ (22), షారూఖ్ పఠాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22), యూసుఫ్కాన్ బహదూర్ ఖాన్ (44) ఉన్నారు. 

పెరుగుతున్న విష విద్వేషం.. ప్ర‌ధాని, బీజేపీ నాయకులు నోరు తెర‌వాలి.. : మనోజ్ ఝా

ఇదిలా ఉండ‌గా.. కొంత కాలం కిందట ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇవి దేశమంతా దుమారాన్ని రేకెత్తించాయి. ప్ర‌పంచ‌లోని అనేక గ‌ల్ప్ దేశాలు కూగా ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించాయి. ఆయా దేశాల్లో ఉంటున్న భార‌త రాయభారుల‌ను పిలిపించుకొని వివ‌ర‌ణ కోరాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తమ‌య్యాయి. ఇవి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు దారి తీశాయి. త‌రువాత ఈ ఆందోళ‌న‌లు కొంత త‌గ్గుముఖం ప‌డ్డాయి. అయితే ఇటీవ‌ల రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో క‌న్హ‌య్య లాల్ అనే టైల‌ర్ నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దీంతో అత‌డిని ఇద్ద‌రు వ్య‌క్తులు  దారుణంగా హ‌త్య చేశారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను కూడా విడుద‌ల చేశారు.ఇస్లాంను అవ‌మానించినందుకు ఇలా చేశామ‌ని అందులో పేర్కొన్నారు. 

ఈ ఘ‌ట‌నను దేశం మ‌ర‌వ‌క ముందే మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తిలో మ‌రో హ‌త్య  ఘ‌ట‌న వెలుగు చూసింది. వెటర్న‌రీ ఫార్మ‌సిస్టుగా ప‌ని చేసే ఉమేష్ కోల్హే ను కొంద‌రు హ‌త్య చేశారు. ఆయ‌న కూడా అంత‌కు ముందు నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతోనే అత‌డిని చంపేశార‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios