Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న విష విద్వేషం.. ప్ర‌ధాని, బీజేపీ నాయకులు నోరు తెర‌వాలి.. : మనోజ్ ఝా

Manoj Jha: "ఉదయ్‌పూర్ సంఘటన సమిష్టిగా మనందరికీ అవమానం కలిగిస్తుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించండి అని చెప్పడం చాలా సులభం. కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, గత ఎనిమిది-తొమ్మిదేళ్లలో ఇలా ఎందుకు జరిగింది? దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు.. గత కొన్నేళ్లుగా ఇంత విష విద్వేషం ఎక్క‌డి నుంచి పుట్టుకొస్తోంది" అని  ఎక్కడి ఆర్జేపీ నాయ‌కుడు మ‌నోజ్ ఝా అన్నారు. 
 

PM Narendra Modi,, BJP leaders must speak up to ease communal tension: RJD leader Manoj Kumar Jha
Author
Hyderabad, First Published Jul 4, 2022, 3:46 PM IST

RJD leader Manoj Kumar Jha: ఇటీవ‌లి కాలంలో దేశంలో విద్వేషం, అస‌హ‌నం పెరుగుతున్న తీరుపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికార ప్ర‌తినిధి నుపూర్ శ‌ర్మ‌కు మ‌ద్దుతు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసినందుకు రాజ‌స్థాన్‌లో దారుణ హ‌త్య చోటుచేసుకుంది. ఇంద‌రు దుండ‌గులు టైల‌ర్ షాప్‌లోకి దూరి ద‌ర్జీ క‌న్హ‌య్య లాల్ ను అత్యంత క్రూరంగా గొంతు న‌రికి చంపారు. ఈ ఘ‌ట‌న్న యావ‌త్ భార‌తావ‌ని ఖండించింది. దీనిపై ఆర్జేడీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యులు మ‌నోజ్ కుమార్ ఝా స్పందించారు. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న త‌ర్వాత దేశంలో సిద్ధాంతాల యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయ‌ని అన్నారు. దేశంలో ప్ర‌స్తుత ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించ‌డంతో పాటు శాంతిని కాపాడ‌టానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. 

ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ఈ ధోర‌ణిని త‌గ్గించ‌డానికి, ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండ‌టానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు మాట్లాడాల్సిన అవ‌ర‌స‌రముంద‌న్నారు. వీరు వెంట‌నే నోరుతెరిచి మాట్లాడాల‌ని మ‌నోజ్ కుమార్ ఝా కోరారు. ఐఏఎన్ఎస్ నివేదించిన వివ‌రాల ప్ర‌కారం.. అర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. "ఉదయ్‌పూర్ సంఘటన సమిష్టిగా మనందరికీ అవమానం కలిగిస్తుంది. అలాంటి వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించండి అని చెప్పడం చాలా సులభం. కానీ నాకు.. నా బృందానికి, చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, గత ఎనిమిది-తొమ్మిదేళ్లలో ఇలా ఎందుకు జరిగింది? దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు.. గత కొన్నేళ్లుగా ఇంత విష విద్వేషం ఎక్క‌డి నుంచి పుట్టుకొస్తోంది" అని  ఎక్కడి ఆర్జేపీ నాయ‌కుడు మ‌నోజ్ ఝా అన్నారు. 

“ఇప్పుడు ప్రతి వీధి సరిహద్దుగా మారిపోయింది.. గ్రామాలు విభజించబడ్డాయి.. వీధులు విభజించబడ్డాయి.. దీనికి బాధ్యులెవరు? మేము ఏ వ్యక్తితోనూ ఓపెన్ మైండ్‌తో మాట్లాడలేము.. ఇలాంటి క్రూరత్వం, హింస ప్రతిరోజూ జరుగుతూనే ఉంది”అని ఆయన అన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ, “కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అలాగే, అనేక రాష్ట్రాల్లో కూడా బలమైన మంత్రివర్గం ఉది.. వారు డిక్టేట్ జారీ చేయలేదా? విదేశాల్లో నిరసనలు వచ్చినప్పుడు మీరు చర్యలు తీసుకున్నారు. అందుకే ఈ వ్యాధికి మూలం ఎక్కడో ఉందని, దాని మూలాలు ఎక్కడో ఉన్నాయని చెబుతున్నాను” అని అన్నారు. “ఈ దేశంలో పెరిగిన విషవృక్షాన్ని కొమ్మను నరికి నాశనం చేయలేరు. ఒక మతానికి చెందిన మతోన్మాదం మరో మతానికి చెందిన మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోంది'' అని అన్నారు. 

ప్ర‌స్తుతం దేశంలో పెరుగుతున్న విద్వేష విష బీజాల‌పై ప్ర‌ధాని న‌రేద్ర మోడీ మాట్లాడాల‌ని ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న త‌ర్వాత రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయ‌న అభిప్రాయాల‌ను ప్ర‌స్తావించిన కుమార్ ఝా.. దేశంలో విష‌పూరిత, ఆందోళ‌న క‌లిగించే తీరులో ద్వేషం పెరుగుతున్న ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్య‌త ప్ర‌ధాన మంత్రిపై ఉంటుంది. నేడు దేశంలో ఇండ్లు కాలిపోతున్నారు. విభ‌జ‌న రేఖ‌లు పెరుగుతున్నాయి. ప్ర‌ధాని నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చి విజ్ఞప్తి చేయడం ఆయ‌న విధి అని అన్నారు.  “సబ్కా సాథ్, సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్ గురించి మాట్లాడుతున్నారు స‌రే.. అప్పుడు దాని అక్షం ఎక్కడ ఉంది? ప్రధాని చేసిన ఒక్క విజ్ఞప్తి దేశంలో చాలా మార్పును తెస్తుంది అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios