Asianet News TeluguAsianet News Telugu

శివ‌సేన నాయ‌కుడు సంజయ్ రౌత్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ.. ఏ కేసులో అంటే ?

ఈడీ కేసులతోనే సతమతమవుతున్న శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కు మరో కేసులో బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈ వారెంట్ వచ్చింది. 

 

Bailable warrant issued against Shiv Sena leader Sanjay Raut.. In which case?
Author
Mumbai, First Published Jul 4, 2022, 3:49 PM IST

బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై విచారణకు హాజరుకాకపోవడంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై కోర్టు సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గత నెలలో రౌత్‌కు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసి, జూలై 4వ తేదీ (సోమ‌వారం) త‌న ముందు హాజ‌రుకావాల‌ని గ‌తంలో కోరింది. 

అలా జరిగితే డిక్టేటర్‌ను అవుతానని స్టాలిన్ వార్నింగ్.. ‘కఠిన చర్యలు తీసుకుంటా’

అయితే రౌత్ లేదా ఆయ‌న త‌రఫున లాయర్లు సోమవారం కోర్టుకు హాజరుకాలేదని మేధా సోమయ్య తరపు న్యాయవాది వివేకానంద్ గుప్తా తెలిపారు. అందుకే తాము ఆయ‌న‌పై వారెంట్ జారీ కోసం దరఖాస్తు చేసామని అన్నారు. దానిని కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన అనంత‌రం ఈ  కేసు విచార‌ణ‌ను జూలై 18కి వాయిదా వేసింది. 

వ‌ర‌ద‌ల్లోనే అస్సాం.. మ‌రో ఐదుగురు మృతి.. 179కి చేరిన మ‌ర‌ణాలు..

అంతకుముందు మేజిస్ట్రేట్ సమన్లు ​​జారీ చేస్తున్నప్పుడు.. ఫిర్యాదుదారు (మేధా సోమ‌య్య‌)పై నిందితులు పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని కోర్టు పేర్కొంది. నిందితుడు సంజయ్ రౌత్ మాట్లాడిన మాటలు ఫిర్యాదుదారుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదుదారుడు ప్రాథమికంగా రుజువు చేశారని కోర్టు తెలిపింది. 

మేధా సోమయ్య న్యాయవాదులు గుప్తా, లక్ష్మణ్ కనల్ ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదులో.. రౌత్ తనపై,  తన భర్తపై నిరాధారమైన, పూర్తిగా పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని, కొన్ని పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499, 500 ప్రకారం నిర్వచించిన పరువు నష్టం ఆరోపణలపై అతనిపై విచారణ ప్రారంభించాలని ఆమె కోర్టును కోరారు.

‘ధూమ్-4 Coming Soon’.. సినీ ఫక్కీలో చోరీ.. బ్లాక్ బోర్డుపై ఫోన్ నెంబర్లు రాసి మరీ దొంగతనం

ఇదిలా ఉండ‌గా.. మనీలాండరింగ్ కేసులో స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయ‌డానికి సంజ‌య్ రౌత్ శుక్రవారం ED ఆఫీసు వెళ్లారు. దాదాపు 10 గంటల పాటు ఆయ‌న ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. అయితే ఈ విష‌యంలో వివిధ ర‌కాల అభిప్రాయ‌లు వ్య‌క్తం కావ‌డంతో ఆయ‌న స్పందించారు. తాను వారితో 10 గంటలు ఉన్నాన‌ని తెలిపారు. అధికారులు త‌న‌తో చాలా చ‌క్క‌గా వ్యవహరించార‌ని చెప్పారు. అధికారులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు సమాధానమిచ్చాన‌ని అన్నారు. త‌న‌ను మళ్లీ ఎప్పుడు పిలిచినా వ‌స్తాన‌ని అధికారుల‌కు తెలియ‌జేశాన‌ని స్ప‌ష్టం చేశారు. కాగా ముంబైలోని ‘చాల్’ రీడెవలప్‌మెంట్,  రౌత్ భార్య, స్నేహితుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తోంది

Follow Us:
Download App:
  • android
  • ios