Bangalore: ఏ మహమ్మారి.. ఏ యుద్ధమూ ప్రపంచ ప్రకాశవంతమైన దేశంగా భారత్ మారడాన్ని ఆపలేవని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023ను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో మరణించిన వారికి సంతాపం ప్ర‌క‌టిస్తూ.. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు.  

India Energy Week 2023: బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023ని ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఏ మహమ్మారి.. ఏ యుద్ధమూ ప్రపంచ ప్రకాశవంతమైన దేశంగా భారత్ మారడాన్ని ఆపలేమ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023ను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో మరణించిన వారికి సంతాంప ప్ర‌క‌టిస్తూ.. ఆయా కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధాని న‌రేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. ఈరోజు (ఫిబ్రవరి 6, సోమ‌వారం) కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ బెంగళూరు సాంకేతికత, ప్రతిభ-ఆవిష్కరణలతో నిండిన నగరమ‌ని పేర్కొన్నారు. త‌న‌లాగే, మీరు కూడా ఇక్కడి యువశక్తిని ముందుకు న‌డుపుతుండాల‌ని అన్నారు. భారతదేశ G-20 ప్రెసిడెన్సీ క్యాలెండర్‌లో ఇది మొదటి ప్రధాన శక్తి ఈవెంట్ గా అభిర్ణించారు.

భారత్ ప్రతి సవాళ్లను అధిగమించింది..

మహమ్మారి, యుద్ధం ప్రభావాలు ఉన్నప్పటికీ 2022లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తూనే ఉందని ప్రధాని మోడీ అన్నారు. "బయటి పరిస్థితులు ఎలా ఉన్నా భారత్ ప్రతి సవాళ్లను అధిగమించింది. దీని వెనుక అనేక అంశాలు పనిచేశాయి. వీటిలో స్థిరమైన ప్రభుత్వం, నిరంతర సంస్కరణలు, అట్టడుగు స్థాయిలో సామాజిక-ఆర్థిక సాధికారత ఉన్నాయి. ఇంధన రంగ అభివృద్ధికి భారత్‌కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇంధన వనరుల అభివృద్ధి-శక్తి పరివర్తన ప్రక్రియలకు సంబంధించి భారతదేశం దృఢంగా ఉంది. 21వ శతాబ్దంలో భారతదేశం నిజంగా దేశానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుందని" అన్నారు.

గ్లోబల్ బ్రైట్ స్పాట్‌లో భారతదేశం..

నేడు భారతదేశంలోని కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. నేడు కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి స్థాయికి చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని IMF ఇటీవలి వృద్ధి అంచనాను తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహమ్మారి లేదా యుద్ధం భారతదేశాన్ని 'గ్లోబల్ బ్రైట్ స్పాట్'గా మారకుండా ఆపలేదని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

Scroll to load tweet…

టర్కీ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. 

అలాగే, టర్కీలో సంభవించిన భూకంపంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్ర‌కృతి విప‌త్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌న్నారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. ఈ సమయంలో మన అందరి దృష్టి టర్కీలో సంభవించిన భూకంపంపైనే ఉందని ప్రధాని అన్నారు. చాలా మంది దుర్మరణం చెందారనీ, చాలా నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయ‌ని తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల సానుభూతి భూకంప బాధితులపై ఉంద‌నీ, భూకంప బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇదే విషయాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా కూడా వెల్ల‌డించారు.