లక్నోలోని లులు మాల్ నెలకొన్న నమాజ్ వివాదం ఇంకా చల్లారడం లేదు. నమాజ్ చేసిన వారిలో ముస్లిమేతరులు ఉన్నాయని మీడియాలో వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. అవి నిజం కావని అన్నారు. అలాగే తమ సంస్థలు 80 శాతం ఉద్యోగులు హిందువులేనని మాల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
తీవ్ర వివాదానికి, ఆందోళనకు దారి తీసిన లులు మాల్ నమాజ్ ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. జూలై 12న మాల్ ఆవరణలో నమాజ్ చేస్తూ కెమెరాకు చిక్కిన ఎనిమిది మంది ముస్లిమేతరులంటూ వచ్చిన మీడియా కథనాలను లక్నో పోలీసులు సోమవారం ఖండించారు. అందులో ముస్లింలు కాని వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇప్పటి వరకు 16 మందిపై జూలై 16వ తేదీన కేసు నమోదు చేశామని తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం, సామరస్యానికి భంగం కలిగించేలా నినాదాలు చేసినందుకు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవితో పాటు మరో రెండింటికి నరీందర్ బాత్రా రాజీనామా...
విచారణ ఇంకా కొనసాగుతోందని, ఘటనకు సంబంధించిన ఫుటేజీ కోసం మాల్‌లోని సీసీటీవీని స్కాన్ చేస్తున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ మీడియా సంస్థలలో కనిపించే వార్తా నివేదికలపై నేను వ్యాఖ్యానించలేను. కానీ దర్యాప్తు కొనసాగుతోంది. మేము ఆవరణలో నమాజ్ చేసిన వ్యక్తుల వివరాలను త్వరలో వెల్లడిస్తాము’’ అని ఆయన ‘ది హిందూ’తో తెలిపారు.
ఢిల్లీలో దారుణం.. భార్య మీద కామెంట్స్.. ముగ్గురు సహచరుల్ని కాల్చి చంపిన పోలీస్.. !
అయితే ఈ ఘటనపై మాల్ యాజమాన్యం మరో సారి ఓ ప్రకటన చేసింది. ‘‘ కొన్ని స్వార్థ ప్రయోజనాలు మా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించడం బాధాకరం. మాకు ఇక్కడ ఉన్న అందరు కార్మికులు స్థానికులే. వీరిలో 80 శాతానికి పైగా హిందువులు. మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మా ఉద్యోగులందరినీ స్కిల్, మెరిట్ ఆధారంగా నియమించుకున్నాం. కులం, మతం ఆధారంగా కాదు. మా స్థాపనలో మతపరమైన కార్యకలాపాలు నిర్వ హించడానికి ఎవరికీ అనుమతి లేదు. బహిరంగ ప్రదేశంలో ప్రార్థనలు, చేసేందుకు ప్రయత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేనేజ్ మెంట్ చర్యలు తీసుకుంది. స్వార్థ ప్రయోజనాలతో మా వ్యాపార సంస్థను లక్ష్యంగా చేసుకోకండి.’’ అని పేర్కొంది.
యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ ఎంఏ నిర్వహిస్తున్న ఈ లులు మాల్‌ను జూలై 10వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.అయిఏత 13వ తేదీన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో లలు మాల్ ప్రాంగణంలో ఎనిమిది మంది వ్యక్తులు నమాజ్ చేసారు. ఈ వీడియోపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ మాల్ లో తాము కూడా హనుమాన్ చాలీసా, సుందరాఖండ పఠిస్తామని హెచ్చరించాయి. సోషల్ మీడియాలో కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో మేనేజ్ మెంట్ స్పందించింది. నమాజ్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. శనివారం ఇద్దరు వ్యక్తులు లులు మాల్‌లోకి ప్రవేశించి హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో వారిపై కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. లక్నోలోని బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన ప్రార్థనలు పాఠించడం నిషేదంలో ఉంది.