దేశ రాజధాని ఢిల్లీలో సిక్కింకు చెందిన ఓ పోలీస్ తన ముగ్గురు సహచరులను కాల్చి చంపాడు. దీనికి కారణం వారు అతడిని మానసికంగా హింసించడమేనని తేలింది.
ఢిల్లీ : బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్నామని మరిచిపోయారు. తమ సహచరుడి భార్య గురించి తప్పుగా మాట్లాడారు. అది అతడిని మానసిక వేదనకు గురి చేసింది. అంతే వెనకా ముందూ చూసుకోకుండా చేతిలో ఉన్న తుపాకీకి పని చెప్పాడు. దీంతో ముగ్గురు సహోద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే...
ఓ పోలీసు తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర పహారా కాస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిక్కిం పోలీస్ కు చెందిన ఇండియన్ రిజల్ట్ బెటాలియన్ విభాగానికి చెందిన 32 ఏళ్ల ప్రబిన్ రాయ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కమాండర్ పింటో నంగయాల్ భుటియా, ఇంద్రాలాల్ ఛెత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధన్ హాంగ్ సుబ్బా అనే పోలీస్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు వివరించారు.
గోమూత్రాన్ని కొనుగోలు చేయనున్న ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం.. లీటర్‌కు రూ. 4
అయితే ప్లాంట్ దగ్గర పహారా కాస్తున్న సమయంలో వీరిమధ్య ఘర్షణ జరగడమే ఈ కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ కాల్పుల ఘటనపై మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తమకు పిసిఆర్ కాల్ వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ముగ్గురు కిందపడి ఉన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరూ అప్పటికే మృతి చెందగా.. ఒకరు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళామని.. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు ప్రబీన్ రాయ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు అని తెలిపారు.
అయితే, ఈ కాల్పులకు కారణం ఆ జవాన్ల మధ్య భార్యలకు సంబంధించిన అవాంఛనీయమైన సంభాషణే అని తేలింది. తన ముగ్గురు సహోద్యోగులు తన భార్య గురించి "చెడుగా మాటలు" చెప్పి తనను మానసికంగా వేధించారని ప్రాథమిక విచారణలో రాయ్ పోలీసులకు చెప్పారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్) దేపేంద్ర పాఠక్ తెలిపారు.
Viral Video: పాము కోసం ఇల్లు కూలగొట్టారు.. పామును కాపాడుతున్న వైరల్ వీడియో ఇదే
జమ్మూ కాశ్మీర్‌లో రెండు హత్య ఘటనలు జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జవాన్ శనివారం తన ముగ్గురు సహచరులను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పూంచ్‌లో జరిగిన వేరొక హత్య ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
