ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరదల నేపథ్యంలో రాజకీయాలు కాకారేపుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పర్యటిస్తుండగా, ఆయన సెల్పీ ఫొటో దిగడం వివాదాస్పదం కాగా, తాజాగా ఓ అవ్వకు పెన్షన్ నిరాకరించడంపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రోజురోజుకూ రాజకీయాలు కాకరేపుతూనే ఉన్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలను, నేతలను ఇరకాటంలో పెట్టే అంశాలను పట్టుకుని విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఆఖరకు ప్రకృతి ప్రకోపం కారణంగా వరదలు పొటెత్తి వేలాది మంది నిరాశ్రయులు కాగా, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలోనూ రాజకీయాలు మానుకోలేదు రాష్ట్ర నాయకులు. తాజాగా దివ్యాంగురాలైన ఓ అవ్వకు ప్రభుత్వం పెన్షన్ కట్ చేసిన అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
Also Read: హీట్ పుట్టిస్తున్న పంజాబ్ రాజకీయం.. పొత్తుల్లో అమరీందర్ దూకుడు
తెలుగు దేశం పార్టీ (TDP) ట్విట్టర్‌లో.. ఇది ప్రజాస్వామ్యమా? రాక్షతత్వమా? . అహంభావం తలకెక్కితే చేసే పనులు ఇవి. వాళ్లకు హక్కుగా వచ్చే పెన్షన్ రావాలి అంటే, జగన్ రెడ్డికి (CM YS Jagan Mohan Reddy) మొక్కాలట. అంటూ ట్వీట్ చేసింది. ఇదే విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ (Lokesh Nara) సైతం వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజే వైసీపీ ప్రభుత్వం దివ్యాంగురాలైన అవ్వని అవమానించడం విచారకరం. అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మకి భూమి ఉందని సాకు చూపి పెన్షన్ కట్ చేశారు. అసలు తనకు భూమే లేదని మొరపెట్టుకున్నా కరుణించలేని అధికారులు, జగనన్నకి మొక్కుకో అంటూ అవమాన పర్చేలా మాట్లాడటం ఘోరం. తక్షణమే పుల్లమ్మ పింఛన్ పునరుద్దరించాలి.పండుటాకుల ఆసరా తీసేసి ఎంటీ ఆరాచకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan Mohan Reddy) గారూ ! అంటూ ట్వీట్ చేశారు.
Also Read: రైతు ఉద్యమం ఆగదు.. పెండింగ్ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..
ఇదిలావుండగా, అనంతపురం జిల్లా, యాడికి మండలంలోని కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మ కొంత కాలంగా పింఛన్ రావడం లేదు. తన పింఛన్ తొలగించారని తెలుసుకున్న వృద్ధురాలు.. దానిని పునరుద్ధరించాలని అధికారుల వద్దకు వెళ్లి అడగ్గా వింత సమాధానం ఎదురైందని పుల్లమ్మ చెప్పింది. పింఛన్ రావాలంటే జగనన్నకు మొక్కు అంటూ అధికారి చెప్పినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, పుల్లమ్మకు భూమి ఉందనే కారణంతో అధికారులు ఫించన్ తొలగించినట్టు సమాచారం. అయితే, తన పేరుమీద ఎలాంటి భూమి లేదని పుల్లమ్మ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Also Read: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..