భారతదేశంలో తప్ప మరే ఇతర దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను డిజిటల్ గా అందించలేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఓ సమావేశానికి హాజరైనప్పుడు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా హార్డ్ కాపీ రూపంలోనే తన కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. 

భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు స్మార్ట్ ఫోన్ లలో లభిస్తోందని కొనియాడారు. ఇలాంటి సేవలు ఇతర దేశాలు ఇంత వరకు అందించలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిన్ యాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను అందుకున్న భారతీయ ప్రజలను అభినందించారు. భారత దేశంలో సాంకేతిక రంగం ముందుకు సాగుతోందని అన్నారు.

3 నెలల్లోగా లావు తగ్గండి.. అయినా ఫిట్ గా మారకపోతే వీఆర్ఎస్ తీసుకోండి - పోలీసులకు డీజీపీ వార్నింగ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఢిల్లీలో సుందర్ పిచాయ్ తో గతంలో ఓ సమావేశంలో పాల్గొన్నాని అన్నారు. ఆ సమయంలో పిచాయ్ తన కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను చేతిలో పెట్టుకొని వచ్చారని తెలిపారు. కానీ తాను సాప్ట్ కాపీని మాత్రమే వెంట తీసుకెళ్లానని అన్నారు. అయితే ఆ సమయంలో భారత అందింపుచుకున్న సాంకేతికతన గూగుల్ సీఈవో కొనియాడారని అన్నారు. పిచాయ్ అమెరికాలో ఉంటారని, ఆయన నివసించే దేశం కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను హార్డ్ కాపీ రూపంలో అందించిందని చెప్పారు. కానీ భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా తమ మొబైల్ ఫోన్లలో డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను కలిగి ఉన్నారని, ఇది మరే ఇతర దేశానికి సాటిలేని ఘనత అని ఠాకూర్ నొక్కి చెప్పారు. 

చనిపోయిన ముస్లిం మహిళను గెలిపించిన ఓటర్లు.. యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..

డిజిటల్ చెల్లింపులు, సర్టిఫికెట్ల ప్రవేశాన్ని ప్రస్తావిస్తూ డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాల పట్ల మంత్రి గర్వం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పరిగణనలోకి తీసుకున్న విలువైన సూచనలు చేసిన అధికారుల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ సమ్మిళిత విధానం పౌరులకు గ్యాస్ సిలిండర్లు, గృహనిర్మాణం, నీటి కనెక్షన్లు వంటి అత్యవసర సేవలను అందించడానికి ప్రభుత్వానికి వీలు కల్పించిందని తెలిపారు. 

Scroll to load tweet…

కాగా.. గత ఏడాది డిసెంబర్ లో సుందర్ పిచాయ్ ప్రధాని మోడీని కలిశారు. మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న వేగవంతమైన సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో గణనీయమైన ఎగుమతిదారుగా భారతదేశం సామర్థ్యాన్ని, అనుసంధానించబడిన ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్థ నుండి ప్రయోజనం పొందే సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. 300 మిలియన్ డాలర్ల నిబద్ధతతో భారతీయ స్టార్టప్ లకు మద్దతు ఇవ్వడంపై గూగుల్ దృష్టి పెడుతుందని, ఇందులో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మహిళల నేతృత్వంలోని వెంచర్లలో పెట్టుబడి పెడతామని ఆయన హామీ ఇచ్చారు.

వివాహ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేశారని తముళ్లను హతమార్చిన అన్న.. బావమరిదిపై కూడా దాడి..ఎక్కడంటే ?

సాంకేతిక పురోగతికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి మధ్య సమతుల్యత సాధించాల్సిన ఆవశ్యకతను సుందర్ పిచాయ్ ప్రస్తావించారు. చట్టబద్ధంగా పటిష్టమైన వాతావరణంలో కంపెనీలు వృద్ధి చెందడానికి వీలు కల్పించే వినూత్న ఫ్రేమ్ వర్క్ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ప్రస్తుత శకం చాలా కీలకమని పిచాయ్ అభిప్రాయపడ్డారు. బహిరంగ, పరస్పర అనుసంధానిత ఇంటర్నెట్ ను ప్రోత్సహించే సామరస్యపూర్వక సమతుల్యతను స్థాపించాల్సిన అవసరం ఉందని అన్నారు.