Asianet News TeluguAsianet News Telugu

మెరుగైన భారత ఆర్ధిక వ్యవస్థ: యూపీఏ పాలనపై నిర్మలా సీతారామన్ సెటైర్లు, విపక్షాల వాకౌట్

మోడీ  ప్రభుత్వంపై  ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై   కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ఇవాళ  చర్చలో పాల్గొన్నారు.

No -confidence motion : Are they fighting among them?: Sitharaman on I.N.D.I.A. coalition lns
Author
First Published Aug 10, 2023, 12:58 PM IST

న్యూఢిల్లీ:  మోడీ పాలనలో  భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగైన స్థితికి చేరిందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  కాంగ్రెస్ ప్రతిపాదించిన  అవిశ్వాస తీర్మానంపై  గురువారం నాడు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

యూపీఏ హయంలో  ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోలేదన్నారు.  కానీ  తమ ప్రభుత్వ హయంలో ప్రజలు ఇంకా ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. 2013లో  మోర్గాన్  సంస్థ భారత ఆర్ధిక వ్యవస్థను  బలహీన ఆర్ధిక వ్యవస్థల జాబితాలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు  చేశారు.

కానీ  అదే  మోర్గాన్ సంస్థ  భారత ఆర్ధిక వ్యవస్థకు అధిక రేటింగ్ ఇచ్చిందన్నారు. తొమ్మిదేళ్లలలో  భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగైన స్థితికి చేరిందన్నారు. తమ ప్రభుత్వ విధానాల వల్లేఈ పరిస్థితి నెలకొందన్నారు.  కరోనా వచ్చినా కూడ  ప్రపంచంలో అత్యంత వేగంగా  అభివృద్ది చెందుతున్న ఆర్ధిక  వ్యవస్థల్లో  ఇండియా ఒకటన్నారు. ప్రజలకు కలలను  సాకారం చేయడంలో  తాము ముందుంటామన్నారు. యూపీఏ సర్కార్  10 ఏళ్ల కాలాన్ని వృధా చేసిందన్నారు. 

విపక్ష కూటమి ఇండియాపై  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  విమర్శలు చేశారు.  ఐక్యంగా  పోరాడడంలో  విపక్ష పార్టీలు వైఫల్యం చెందారన్నారు.. తమలో తాము  పోరాటం చేసుకుంటున్నారని  ఆమె  విపక్ష కూటమిపై సెటైర్లు వేశారు. బ్యాంకింగ్ రంగం మెరుగైన స్థితిలో ఉండాలని  తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ దిశగా  తాము  చర్యలు తీసుకున్నామని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు. రాజకీయ జోక్యం లేకుండా  బ్యాంకులు పనిచేస్తున్నాయన్నారు

also read:కాంగ్రెస్‌లాగా తాయిలాలు ఇవ్వలేదు... అందుకే అటల్‌జీ అవిశ్వాసంలో ఓడారు : అమిత్ షా వ్యాఖ్యలు

.కేంద్ర మంత్రి అవిశ్వాస తీర్మానంపై  ప్రసంగిస్తున్న సమయంలో  విపక్షాలు లోక్ సభ నుండి వాకౌట్ చేశాయి.  కాంగ్రెస్,ఎన్‌సీపీ,  డీఎంకే ఎంపీలు వాకౌట్ చేశారు.సబ్ కా సాత్,  సబ్ కా వికాస్, సబ్కా  వికాస్ ప్రయాస్ ద్వారా  తమ ఆర్ధిక విధానాలను మెరుగుపర్చుకున్నామన్నారు. కరోనా తర్వాత  ఆర్ధిక రికవరీ మార్గంలో ఉన్నట్టుగా  కేంద్ర మంత్రి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios