ఇటీవల కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల్లో పలువురు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ కార్యక్రమం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో జరిగింది. 

ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎంపికైన సభ్యులు చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు స‌మ‌క్షంలో శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇందులో కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్, పీయూష్ గోయ‌ల్ తో పాటు మ‌రో 27 మంది ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మం రాజ్య‌స‌భ‌లో ఉన్న వెంక‌య్య నాయుడు ఛాంబ‌ర్ లో జ‌రిగింది. రాజ్యాంగ విదేయ‌త‌తో ప‌ని చేస్తామ‌ని పేర్కొన్నారు 

స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలిక కిడ్నాప్.. ఆపై అత్యాచారం

ఈ 27 మంది సభ్యులు 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా వారంతా తొమ్మిది భాషల్లో ప్రమాణం చేశారు. ఇందులో 12 మంది హిందీలో, నలుగురు ఆంగ్లంలో, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒడియాలలో ఇద్ద‌రు చొప్పున ప్ర‌మాణం చేయ‌గా.. పంజాబీ, తమిళం, తెలుగులో మిగిలిన వారు ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే కొత్తగా ఎన్నికైన 57 మంది ఎంపీల్లో మరో నలుగురు సభ్యులు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు.

హిందూ ధ‌ర్మాన్ని బీజేపీ లీజుకు తీసుకుందా ? కాళీ దేవిని ఎలా పూజించాలో మాకు తెలుసు - మహువా మోయిత్రా

ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కొంత మంది నాయకులు.. అలాగే ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయాల్సిన స‌భ్యులు కూడా జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చని వెంక‌య్య నాయుడు స్పష్టం చేశారు. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను అప్ప‌టి నుంచే సభలో సభ్యులుగా పరిగణిస్తారని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు అర్హులా కాదా అనే ప్ర‌శ్న‌కు సమాధానం ఇస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు ఉద్ధవ్ డిమాండ్.. ‘ధనస్సు బాణం గుర్తు మాతోనే ఉంటుంది’

శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన స‌భ్యుల్లో కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేష్, వివేక్ కె తంఖా, ముకుల్ వాస్నిక్, బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నగర్, కె లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి, జయంత్ చౌదరి, కల్పనా సైనీ, సులత, డియో, ఆర్ ధర్మర్ ఉన్నారు. కాగా కొత్తగా ఎన్నికైన 57 మంది సభ్యులలో 14 మంది తిరిగి సభకు ఎన్నికైన వారే ఉన్నారు. ఈ సంద‌ర్భంగా స‌భ్యుల‌ను ఉద్దేశించి చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ.. సభ తదుపరి వర్షాకాల సమావేశాలు కూడా సామాజిక దూరం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా COVID-19 ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయని తెలిపారు. అర్థవంతమైన చర్చలు, నియమాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం ద్వారా సభ గౌరవం, ఆకృతిని నిలబెట్టాలని ఆయన సభ్యులను కోరారు. సభలోని వివిధ సాధనాల కింద లభించే పుష్కలమైన అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవాలని, సమావేశాల సమయంలో క్రమం తప్పకుండా సభకు హాజరు కావాలని నాయుడు కొత్త సభ్యులకు సూచించారు