కాళీ మాతను ఎలా పూజించాలో బీజేపీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు. బీజేపీ హిందూ ధర్మాన్ని లీజుకు తీసుకుందా అని ప్రశ్నించారు. తాను కూడా ఒక హిందువునే అని తెలిపారు.
బీజేపీ హిందూ ధర్మాన్ని ఏమైనా లీజుకు తీసుకుందా అని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అన్నారు. దేవుళ్లకు ఎలా పూజలు చేయాలో ఆ పార్టీ ఎందుకు నేర్పుతుందని ప్రశ్నించారు. కాళీ దేవిని ఎలా పూజించాలో తమకు తెలుసని చెప్పారు. కాళీ మాత పోస్టర్ వివాదంపై ఆమె ‘ఏబీపీ లైవ్’ తో పాటు పలు బెంగాళీ ఛానెల్స్ తో ఆమె మాట్లాడారు.
కాళిని ఎలా పూజిస్తానో చెప్పే హక్కు బీజేపీకి లేదని ఆమె అన్నారు. ‘‘ బెంగాలీలకు కాళీని ఆరాధించడానికి వారి సొంత ఆచారాలు ఉన్నాయి. నేను హిందువుని, మా కాళిని ఎలా పూజించాలో నాకు తెలుసు. బెంగాల్‌లో మా కాళిని మాంసం, మద్యంతో పూజించడం చాలా సహజం. ఇది ఒక ఆచారం. చాలా సాధారణం. నాపై ఫిర్యాదులు చేస్తున్న బీజేపీ మద్దతుదారులను ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. బెంగాలీలు అసలు కాళిని ఎలా పూజిస్తారో వారికి తెలియదు.’’ అని ఆమె అన్నారు.
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మొహమ్మద్ జుబేర్‌కు బెయిల్ మంజూరు.. కానీ, జైలులోనే ఉండాలి!
‘‘నేను పక్కా హిందువుని. వివాదాస్పద పోస్టర్‌పై నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ పోస్టర్‌పై నేను చెప్పేదేమీ లేదు. నేను ఏమి చెప్పానో నాకు తెలుసు. నేను కూడా కాళీ ఆరాధకురాలినే. ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది. బెంగాల్‌లోని అన్ని జిల్లాల్లో మీరు నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే, ఆ పోలీస్ స్టేషన్‌కు 10 కి.మీ పరిధిలో నేను చెప్పిన విధంగానే కాళీని పూజిస్తారు. ఈ విషయంలో నేను బీజేపీకి సవాల్ విసురుతున్నాను. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మా కాళిని మాంసం, మద్యంతో పూజిస్తారు. నేను తప్పు చేస్తే, నా వ్యాఖ్యలు తప్ప అయితే వాటిని నేను వెనక్కి తీసుకుంటాను. ’’ అని ఆమె అన్నారు.
బీజేపీ ఎప్పటి నుంచో హిందూత్వ ఆలోచనను మనలో రుద్దాలని కోరుకుంటోందని అన్నారు. భారతదేశం వంటి దేశంలో అన్ని మతాలపై చర్చించవచ్చని తెలిపారు. ‘‘ నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు నేను భయపడను. బీజేపీ మొహిలా మోర్చా నాపై ఫిర్యాదు చేస్తోంది, అయితే మనమందరి హిందువుల మాదిరిగానే వారు కూడా అలాగే పూజిస్తారు. నేను హిందువునే. అయినా బీజేపీ మద్దతుదారులు, నాయకులు ఫిర్యాదులు చేస్తూ నన్ను అవమానించారు. నూపుర్ శర్మ కేసు, నా వ్యాఖ్యలు రెండూ వేర్వేరు రకాలు. సెక్షన్ 295A ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇతరుల మతం, భావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఏదైనా మాట్లాడితే నేరం అవుతుంది’’ అని అన్నారు.
మెరుగవుతున్న లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. హాస్పిటల్ నుంచి లాలు చిత్రాన్ని షేర్ చేసిన కూతురు
ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై తన డాక్యుమెంటరీ చిత్రం కాళి పోస్టర్‌పై వివాదం నెలకొంది. ఇందులో పోస్టర్‌లో కాళి మాత ధూమపానం చేస్తూ, ఎల్‌జీబీటీక్యూ జెండాను పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ పోస్టర్‌పై హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా మణిమేకలైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఈ విషయంపై ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పై బీజేపీ నుంచి విమర్శలు ఎదరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు
