న్యూఢిల్లీ: పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ మూసుకుపోయాయి. చట్టపరమైన వెసులుబాట్లు అన్నీ పూర్తి కావడంతో వారిని ఉరి తీసేందుకు కొత్త తేదీ ప్రకటన కోసం తీహార్ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 

ఇప్పటి వరకు మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ అయింది. అయితే, చట్టపరమైన వెసులుబాట్లను వాడుకుంటూ నిర్భయ దోషులు అవి వాయిదా పడేలా చేస్తూ వచ్చారు. చివరకు పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉండడంతో మార్చి 3వ తేదీన జరగాల్సిన ఉరి కూడా వాయిదా పడింది.

Also Read: నిర్భయ కేసు: పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ తోసిపుచ్చిన రాష్ట్రపతి

పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించదడంతో దోషులను ఉరి తీయడానికి కొత్త తేదీని ఇవ్వాలని పాటియాల హౌస్ కోర్టును  తీహార్ జైలు అధికారులు కోరారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దోషులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ ను సోమవారం ఉదయం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెంటనే అతను రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. 

అయినప్పటికీ చట్టప్రకారం 14 రోజుల తర్వాతనే ఉరి తీయాల్సి ఉంటుంది. అందువల్ల నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు చేయడానికి 14 రోజులకు పైగానే పట్టవచ్చు. అంటే, అది మార్చి 20 తేదీ ప్రాంతంలో జరిగే అవకాశం ఉంటుంది.

Also Read: కోర్టులు తమాషా చూస్తున్నాయి: స్టేపై నిర్భయ తల్లి ఆగ్రహం

23 వేళ్ల విద్యార్థి విద్యార్థినిపై 2012 డిసెంబర్ 16వ తేదీన ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె డిసెంబర్ 29వ తేదీన మరణించింది. 

ఈ కేసులో ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నలుగురు అక్షయ్ ఠాకూర్ (31్), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), ముకేష్ సింగ్ (32)లకు ఉరి శిక్ష అమలు కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసినప్పటి నుంచి వారు వివిధ చట్టపరమైన వెసులుబాట్లను వాడుకుంటూ దాని ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా చేస్తూ వస్తున్నారు.