లక్నో: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులోని దోషులను ఉరితీయడానికి ఢిల్లీ తీహార్ జైలు అధికారులు పవన్ అనే వ్యక్తి సేవలను కోరారు. నిర్భయ కేసు నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ ఆ విషయం చెప్పారు. 

జనవరి 31వ తేదీన, ఫిబ్రవరి 1వ తేదీన పవన్ సేవల కోసం అడిగినట్లు ఆయన తెలిపారు. మీరట్ కు చెందిన హ్యాంగ్ మన్ పవన్ నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులను ఉరి తీయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ ఇంతకు ముందు చెప్పారు.

Also Read: ఆ రేపిస్టులను క్షమించాలని అడగడానికి ఆమె ఎవరు: నిర్భయ తల్లి

వారిని ఉరితీయడం వల్ల తాను ఊరట పొందుతానని, తనకే కాకుండా నిర్భయ తల్లిదండ్రులకు, దేశంలోని ప్రతి ఒక్కరికి అది ఊరట ఇస్తుందని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తులను ఉరి తీయాల్సిందేనని అన్నారు. 

ఢిల్లీ కోర్టు నలుగురు దోషులకు తాజాగా డెత్ వారంట్ ను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ ఆ డెత్ వారంట్ జారీ అయింది. 

Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షలో మరో మెలిక: సుప్రీంకు పవన్ గుప్తా

2012 డిసెంబర్ 16, 17 అర్థరాత్రి 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్ చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు దోషులు వినయ్, అక్షయ్, పవన్, ముకేష్ లకు ఉరి శీక్ష వేయనున్నారు.

Also Read: లాయర్ ఇందిర జైసింగ్ పై భగ్గుమన్న నిర్భయ తల్లి ఆశాదేవి