ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టుకు ఎక్కిన వీరు.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read:తేదీలు మారతాయేమో అంతే.. శిక్ష తప్పదు: నిర్భయ తల్లి వ్యాఖ్యలు

నిర్భయ ఘటన జరిగిన డిసెంబర్ 16న తాను ఢిల్లీలోనే లేనని దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ పిటిషన్‌ పేర్కొన్నాడు. తనను డిసెంబర్ 17, 2012న రాజస్ధాన్ నుంచి పోలీసులు ఢిల్లీ తీసుకొచ్చి , తీహార్ జైలులో చిత్రహింసలకు గురిచేశారని అతను ఆరోపించాడు. ఈ క్రమంలో తన మరణశిక్షను రద్దు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ముందు తన పిటిషన్ దాఖలు చేశాడు.

కాగా నిర్భయ దోషులు నలుగురిని ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని మార్చి 5న ప్రత్యేక కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరణశిక్షను వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ , పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ రావడంతో ఉరి మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read:నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్: ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టుకెక్కిన దోషులు

కాగా తనకున్న చట్టపరమైన పరిష్కార మార్గాలను పునరుద్దరించాల్సిందిగా కోరుతూ దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది.