న్యూఢిల్లీ:  నిర్భయ కేసు దోషుల్లో రేపు ఫిబ్రవరి 1వ తేదీన ముగ్గురికే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ పెండింగులో ఉన్నందున అతన్ని వదిలేసి మిగతా ముగ్గురికి రేపు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, మరో దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఈ స్థితిలో నలుగురు దోషులకు రేపు ఉరిశిక్షను అమలు చేసే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్ పై పాటియాలా హౌస్ కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది. వినయ్ శర్మ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో దోషులు ఆ పిటిషన్ వేశారు.

Also Read: నిర్భయ కేసు: ఉరికి ఒక్క రోజు ముందు పవన్ గుప్తా మరో మెలిక

నలుగురిని ఒకేసారి ఉరి తీయాలనే నియమేమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగులో ఉందని, మిగతా వారిని ఉరి తీయవచ్చునని, ఇందులో చట్టవ్యతిరేకమైంది ఏదీ లేదని తీహార్ జైలు తరఫు న్యాయవాది ఇర్ఫాన్ అహ్మద్ కోర్టుకు తెలియజేశారు. 

ఉరిశిక్ష అమలు చేసే తేదీని మార్చాలని మార్చాలని కోరుతూ దోషులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన ఆ విధంగా అన్నారు. దోషులు పెట్టుకున్న పిటిషన్ ను ఆయన వ్యతిరేకించారు. 

Also Read: నిర్భయ కేసు... ఉరి బిగిసేనా, తీహార్ జైలుకి తలారి

అయితే, ఆ వాదనలతో దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ విభేదించారు. జైలు నిబంధనల ప్రకారం ఒక కేసులో ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు ఒక్క దోషి అభ్యర్థన పెండింగులో ఉన్నా మిగతావారిని ఉరి తీయడం సాధ్యం కాదని అన్నారు