నిర్భయ కేసు... ఉరి బిగిసేనా, తీహార్ జైలుకి తలారి

ఇక నిర్భయ కేసు నలుగురు దోషులకు ఉరి పడటం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తలారీ పవన్ జల్లాద్ తీహర్ జైలుకు చేరుకున్నాడు. తలారీ పవన్ కోసం జైలు ప్రాంగణంలో ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Pawan Jallad, Who Will Hang Nirbhaya Convicts, Arrives At Tihar Jail

ఉరి నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేయని ప్రయత్నమంటూ లేదు. కోర్టులో ఒకరి తర్వాత ఒకరు రోజుకో పిటిషన్లు వేస్తూ... ఉరితేదీ వాయిదా పడేలా ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఉరి రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ తేదీ కూడా వాయిదా పడాలని వారు ప్రయత్నిస్తున్నారు.. కానీ వారు వేస్తున్న పిటిషన్లను న్యాయస్థానం కొట్టేస్తూ వస్తోంది. 

దీంతో.. ఇక నిర్భయ కేసు నలుగురు దోషులకు ఉరి పడటం ఖాయమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తలారీ పవన్ జల్లాద్ తీహర్ జైలుకు చేరుకున్నాడు. తలారీ పవన్ కోసం జైలు ప్రాంగణంలో ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Also Read ఈసారి ఉరి ఖాయం, నిర్భయ దోషి అక్షయ్ క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత.

తలారీ పవన్ జల్లాద్ ఉరితాడు సామర్థ్యంతోపాటు ఇతర విషయాలను పరిశీలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పవన్ జల్లాద్  ఈ రోజు  ఉరి ట్రయల్స్ (డమ్మీ ఉరి)నిర్వహించనున్నాడు. తీహార్ జైలు అధికారుల విజ్ఞప్తి మేరకు మీరట్ కు చెందిన తలారీ పవన్ జల్లాద్ నిర్బయ దోషులను ఉరితీసేందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు పవన్‌ సేవల్ని అందించాలని కోరడంతో ఆయన తీహార్‌ కారాగారానికి చేరుకుని ఉరితీతకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులేవీ ఎదురుకాకుండా వుంటే నిర్భయ కేసులో నలుగురు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మకు ఫిబ్రవరి 01వ తేదీన ఉరిశిక్ష అమలు కానుంది. ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నలుగురిని ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కొద్దిరోజుల ముందు నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకోసం బక్సర్ నుంచి తాళ్లను తెప్పించినట్లు సమాచారం. మూడో నంబర్‌ జైలులో నిర్భయ దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరి తీయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios