నిర్భయ కేసు: ఉరికి ఒక్క రోజు ముందు పవన్ గుప్తా మరో మెలిక
ఉరికంబం ఎక్కడానికి ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న స్థితిలో నిర్భయ దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో రివ్యూ దాఖలు చేశాడు. తాను మైనరునంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేతను తిరిగి సమీక్షించాలని అతను కోరాడు.
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు న్యాయపరమైన వెసులుబాట్లను వాడుకుంటూ ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగా నలుగురు దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నంటూ వేిసన పిటిషన్ ను కొట్టివేయడాన్ని తిరిగి సమీక్షించాలని కోరుతూ అతను పిటిషన్ దాఖలు చేశాడు.
తనకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని అతను కోరాడు. రేపు ఫిబ్రవరి 1వ తేదీన నలుగురు దోషులను ఉరి తీయడానికి తీహార్ జైలులో ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో పవన్ గుప్తా ఆ పిటిషన్ దాఖలు చేశాడు.
Also Read: నిర్భయ కేసు... ఉరి బిగిసేనా, తీహార్ జైలుకి తలారి
2012 డిసెంబర్ లో జరిగిన నిర్భయ రేప్, హత్య జరిగినప్పుడు తాను మైనర్ ను అంటూ పెట్టుకున్న పవన్ గుప్తా పిటిషన్ ను సుప్రీంకోర్టు గతవారం కొట్టేసింది. ఒక్కసారి తోసిపుచ్చిన తర్వాత మరోసారి దాన్ని సవాల్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పిటకీ పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
ఇదిలావుంటే, తలారి గురువారంనాడు ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరుకున్నాడు. పవన్ గుప్తా, ముకేష్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మలను ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయడానికి డెడ్ లైన్ నిర్ణయమైంది.
Also Read: ఈసారి ఉరి ఖాయం, నిర్భయ దోషి అక్షయ్ క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత