Asianet News TeluguAsianet News Telugu

వాళ్లకు ఉరి ఖాయం... అప్పుడే నా కూతురికి న్యాయం... నిర్భయ తల్లి

దోషుల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే... ఈ పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టివేస్తుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆమె పేర్కొన్నారు.
 

Hopeful that curative pleas of convicts will be rejected, says Nirbhaya's mother
Author
Hyderabad, First Published Jan 14, 2020, 12:20 PM IST

నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడటం ఖాయమని ఆమె తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీన నిర్భయ పై అత్యాచారం, హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందిగా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నలుగురు దోషులకు ఒకేసారి ఉరి వేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడడా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. దోషుల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే... ఈ పిటిషన్ ని సుప్రీం కోర్టు కొట్టివేస్తుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని ఆమె పేర్కొన్నారు.

Also Read కేంద్రానికి షాక్: సీఏఏపై సుప్రీంకోర్టుకెక్కిన కేరళ సర్కార్...

ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ ఠాకూర్(31)లను ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలకు తీహార్ జైలులో ఉరితీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు  జారీ చేసింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ ల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు  చేశారు.ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. 

ఈ విషయంపై నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు.   దోషులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు.  కానీ... అవి తిరస్కరణకు గురౌతాయని తానుభావిస్తున్నట్లు ఆమె చెప్పారు. జనవరి 22వ తేదీన వారిని ఉరితీయడం ఖాయమని వారు చెప్పారు.  వారికి ఉరితీసిన రోజే తన కూతురికి న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios