Asianet News TeluguAsianet News Telugu

కేరళలో ఎన్ఐఏ దాడులు.. పీఎఫ్‌ఐ మాజీ నేతల ఇళ్లలో సోదాలు

ఎన్ఐఏ కేరళలో దాడులు నిర్వహించింది. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మాజీ నేతల ఇళ్లలో గురువారం సోదాలు చేపట్టింది. దాదాపు 56 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. 

NIA raids in Kerala Houses of former PFI leaders searched
Author
First Published Dec 29, 2022, 12:51 PM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తరువాత ఆ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన అణిచివేతను కొనసాగిస్తోంది. కేరళలో గతంలో పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న వారి స్థలాలపై గురువారం దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు పీఎఫ్‌ఐ నేతల నివాసాలపై ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టింది.

కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదు: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

ఎర్నాకులం, తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, పాలక్కాడ్, అలప్పుజ, మలప్పురం జిల్లాల్లోని 56 ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఏకకాలంలో దాడులు ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నిషేధం ఉన్నప్పటికీ కొంత మంది నాయకులు ఇప్పటికీ పీఎఫ్ఐ పనితీరును చురుకుగా సమన్వయం చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది.

కోలుకున్న ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ.. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ - గుజరాత్ ప్రభుత్వం

గతంలో పీఎఫ్‌ఐలో క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్న నాయకుల ప్రాంగణాలపై ప్రత్యేకంగా దాడులు జరిగాయి. నిషేధం తర్వాత అనేక మంది పీఎఫ్‌ఐ నాయకుల కార్యకలాపాలను ఎన్‌ఐఏ ట్రాక్ చేస్తోందని, వారిలో చాలా మంది ఎర్నాకులం, అలప్పుజ, మలప్పురం, తిరువనంతపురంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందిందని వర్గాలు వెల్లడించినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. ఈ దాడుల్లో భాగంగా నిధుల బదిలీలను ట్రాక్ చేయడానికి ఎన్ఐఏ బృందం కొంతమంది అనుమానితుల బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సేకరిస్తోంది.

జార్ఖండ్‌ నటి రియా కుమారి హత్య కేసులో భర్త అరెస్ట్..!

కాగా.. కేంద్రం ఇటీవల ఐదేళ్లపాటు పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ సంస్థపై ఎన్ఐఏ చర్యలు కొనసాగిస్తోంది. సెప్టెంబరులో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు అలాగే పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

జాతీయ స్థాయిలో ముస్లిం వర్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పలు ముస్లిం సంస్థలు ఏకమై 2006లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా గా అవతరించాయి. పీఎఫ్‌ఐగా ఏర్పడిన కొద్ది కాలానికే ఆ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రధానంగా.. మణిపూర్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు వ్యాపించింది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో పీఎఫ్ఐ బలమైన ఉనికిని కలిగి ఉంది. దీనికింద సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్ డీపీఐ), విద్యార్థి విభాగమైన క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ వుమెన్స్‌ ఫ్రంట్‌, రెహబ్‌ ఇండియా ఫౌండేషన్‌తో పాటు ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ వంటివి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios