ఇండో-జర్మన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది : ప్ర‌ధాని మోడీ

 PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ఈ శిఖరాగ్ర సమావేశం ఇండో-జర్మన్ భాగస్వామ్యానికి కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు.

News9 Global Summit is an addition of a new chapter to the Indo-German Partnership: PM Narendra Modi RMA

News9 Global Summit : భారత దేశ మీడియా రంగంలో నెంబర్ వన్‌గా దూసుకుపోతోన్న టీవీ9 సంస్థకు చెందిన న్యూస్‌9 జర్మనీలోని స్టుట్‌గాట్‌‌ నగరంలో గ్లోబల్‌ సమ్మిట్‌ 2024కు శ్రీకారం చుట్టింది. భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. నవంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాగే జర్మనీకి చెందిన మంత్రులు, ప్రతినిధులు, ఇరు దేశాల రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు దాదాపు 200 మంది పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

టీవీ9 నెట్‌వర్క్‌ న్యూస్‌9 గ్లోబల్‌ సమిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇండో-జర్మన్‌ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు. టీవీ9 ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలిపారు.  జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమన్నారు. భారత్‌కు ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి అని ప్రధాని చెప్పారు. రానున్న కాలంలో భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని  విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ రాము జూపల్లి గారు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. భారతదేశానికి యువ శక్తి గొప్ప సంపద. సరికొత్త ఆవిష్కరణలతో ఎన్నో అంకుర సంస్థలు భారతదేశంలో విజయవంతంగా ఎదిగి, అభివృద్ధి సాధించాయి. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థలకు భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి, ప్రపంచం నలువైపుల నుంచి భారత్ లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు.

News9 Global Summit is an addition of a new chapter to the Indo-German Partnership: PM Narendra Modi RMA

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో రోజు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించడానికి ముందు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోడీ.. ఆయనకంటూ ఓ ప్రత్యేకను గుర్తింపును సంపాదించుకుని ప్రపంచ నేతగా ఎదిగారని  పేర్కొన్నారు. RRR అంటే రిలేషన్ షిప్, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ప్రధాని మోడీ వ్యక్తిత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios