Asianet News TeluguAsianet News Telugu

భార్య వేధింపులు.. నవ వరుడు ఆత్మహత్య.. పెళ్లి చేసుకున్న వారానికే విషాదం

ఉత్తరప్రదేశ్ దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని వారమైనా గడవలేదు. అప్పుడు వారి కాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు తాళలేక నవవరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడిని ఆయన భార్య, ఆమె సోదరుడే వేధించారని, అందుకే మనస్థాపంతో మరణించినట్టు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.
 

newly wed man kills self after facing harrasment by wife
Author
Lucknow, First Published Nov 20, 2021, 3:24 PM IST

లక్నో: కలకాలం కలిసి ముందడుగేయాలని, చిరకాలం కలిసే ఉంటామని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. ఏడు జన్మలూ కలిసి ఉంటామని అనుకున్నారు. వేద మంత్రాల నడుమ అగ్ని సాక్షి ఒక్కటయ్యారు. సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఓ భేదాభిప్రాయం. మనసు ముక్కలైంది. అంతటితో ఆగలేదు.. వేధింపుల(Harassment) వరకు పరిస్థితులు దిగజారాయి. కలలు కన్న జీవితం ఒక్కసారిగా తలకిందులు కావడంతో ఓ నూతన వరుడు(Bridegroom) ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వారమైనా గడవలేదు.. అప్పుడే లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో చోటుచేసుకుంది.

షామ్లీ జిల్లా చూస్నా గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. బాబ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ నవ వరుడు విష పదార్థాలు సేవించి ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నూతన వరుడి సోదరి సీమా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వార్త వెలుగులోకి వచ్చింది. వరుడు ప్రయాస్.. వధువు కోమల్  ఈ నెల 14వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. కానీ, వారం నిండక ముందే వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రయాస్‌ను ఆయన భార్య కోమల్, ఆమె సోదరుడు దూషించారని, ఈ దూషణలు, వేధింపులతో తన సోదరుడు మనస్థాపానికి గురయ్యాడని ఫిర్యాదులో సీమా వివరించారు. ఆ మనస్థాపంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: అన్న పనికి తీసుకువెళ్లనన్నాడని.. రైలు కిందపడి ముగ్గురు యువతులు ఆత్మహత్య.. !!

ఇదిలా ఉండగా, ఇదే జిల్లా షామ్లీలో శుక్రవారం ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 55 ఏళ్ల మదన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్యాన మంజ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగానే స్థానికులు వెంటనే స్పందించి హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే మదన్ కుమార్ మరణించాడని వైద్యులు చెప్పినట్టు చర్తవాల్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. వారి కుటుంబంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. ఈ ఘటనతో గ్యాన మంజ్రా గ్రామంలో విషాదం నెలకొంది.

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి.)

Follow Us:
Download App:
  • android
  • ios