Asianet News TeluguAsianet News Telugu

అన్న పనికి తీసుకువెళ్లనన్నాడని.. రైలు కిందపడి ముగ్గురు యువతులు ఆత్మహత్య.. !!

వయసుకు వచ్చిన చెల్లెల్లను పనికి తీసుకెళ్లడం గణేష్ కు ఇష్టం లేదు. పనికి వచ్చి.. నీతోపాటు సంపాదిస్తామని చెల్లెళ్లు కోరగా అతను ఒప్పుకోలేదు. తమ్ముడు ఒక్కడే కష్టపడడం చూసి ఆర్తీ, ప్రీతి, కాజల్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మార్కెట్ కు వెల్తున్నామని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చారు. మార్కెట్ కి వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదేంటని వారి కోసం గాలించారు. 

Three sisters committed suicide in uttarpradesh
Author
Hyderabad, First Published Nov 20, 2021, 9:38 AM IST

ఉత్తరప్రదేశ్ : ఆ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు. నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది. తండ్రితో పాటు కుమారుడు కూడా పనికి వెల్తుండడంతో భోజనానికి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఇటీవలే తండ్రి మరణించడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పూట గడవడం కష్టంగా మారిపోయింది. 

కుమారుడి ఒక్కడి సంపాదనపైనే ఆ family ఆధారపడింది. ఇటువంటి సమయంలో three sisters కలిసి ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..

జిల్లాలోని అహిరోలి గ్రామానికి చెందిన రాజేంద్ర, ఆశాదేవి దంపతులకు గణేష్, ఆర్తీ (20), ప్రీతి (18), కాజల్ (15)తో పాటు మరో కూతురు ఉంది. వీరిది economically poor family. ఇటీవలే రాజేంద్ర మరణించాడు. దీంతో గణేష్ పనికి వెడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాదేవికి eye problem ఉండడంతో ఆమెకు సరిగ్గా కనిపించదు. దీంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. వయసుకు వచ్చిన చెల్లెల్లను పనికి తీసుకెళ్లడం గణేష్ కు ఇష్టం లేదు.

Tamilnadu Rains : విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

పనికి వచ్చి.. నీతోపాటు money సంపాదిస్తామని చెల్లెళ్లు కోరగా అతను ఒప్పుకోలేదు. తమ్ముడు ఒక్కడే కష్టపడడం చూసి ఆర్తీ, ప్రీతి, కాజల్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మార్కెట్ కు వెల్తున్నామని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చారు. మార్కెట్ కి వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదేంటని వారి కోసం గాలించారు. 

మందుకొట్టే వాళ్లు అబద్ధాలాడరు.. టీకా తప్పనిసరి నిబంధనపై ఈ అధికారి లాజిక్‌కు నెటిజన్లు ఫిదా

ఎంత వెతికినా వారు కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులకు భయం వేసింది. కాసేపటికి గణేష్ కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. బయటకు వెళ్లిన సోదరిమణులు రైలు కింద పడి suicide చేసుకుని చనిపోయారని తెలిసింది. వెంటనే family membersతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాడు. వారిని చూసి భోరున విలపించాడు. తనతో పాటు పనికి తీసుకుపోయినా కనీసం బతికి ఉండేవారు కదా అని వారు ఏడుస్తుంటే.. అందరి హృదయాలను కలిచి వేసింది. రైల్వే పోలీసులకు గేట్ మ్యాన్ సమాచారమివ్వడంతో వారు కూడా వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. 

ఆర్థిక సమస్యలు ముగ్గురు అమ్మాయిల ఉసురు తీశాయి. దీనికి తోడు సమాజంలో అమ్మాయిలు బైటికి వెడితే రక్షణ లేకపోవడం .. పని ప్రదేశంలోనూ లైంగిక వేధింపులు, ఆ అన్నను తన చెల్లెళ్ల విషయంలో జాగ్రత్త పడేలా చేశాయి. కానీ పూట గడవని పరిస్థితిలు వారిని కృంగదీశాయి. దీంతో బతకడం కంటే మరణమే శరణ్యమనుకున్నారు. వందేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా, అత్యంత దారుణంగా ముగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios