Asianet News TeluguAsianet News Telugu

రైల్వే ప్రయాణికుల‌కు నయా రూల్స్..

దేశంలో ఓమ్రికాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రయాణికులందరూ పాటించాలని కోరింది. 

New Rules for Railway Passengers ..
Author
Hyderabad, First Published Dec 9, 2021, 5:34 PM IST

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఓమ్రికాన్ కూడా రోజు రోజుకు  విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో రైల్వే శాఖ అప్ర‌మ‌త్తమైంది. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. విమాన ప్ర‌యాణికుల‌కు రూల్స్ పెట్టిన‌ట్టుగానే రైలు ప్ర‌య‌ణికుల‌కు కూడా రైల్వే శాఖ రూల్స్ పెట్టింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే రైల్వే శాఖ ఒక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువే .. జ‌పాన్ సైంటిస్టులు ఎమ‌న్నారంటే?

నోటిఫికేష‌న్‌లో ఏముంది ? 
క‌రోనాను విస్త‌రించ‌కుండా అడ్డుకునేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన ఓమ్రికాన్ వేరియంట్ అన్ని దేశాల‌కు విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. కోవిడ్ క‌ట్ట‌డికి అంద‌రూ క‌లిసి పోరాడాల్సి ఉంటుంద‌ని, ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా క‌రోనా విజృంభించ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అలాగే కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కూడా కోవిడ్ నియంత్ర‌ణ కోసం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో రైల్వే శాఖ కూడా ప్ర‌యాణికుల‌కు కొత్త రూల్స్ అమ‌లు చేస్తున్నాయి. ప్ర‌యాణికుల ఆరోగ్యం కోసం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక‌త‌ప్ప‌ద‌ని చెప్పింది. ప్ర‌యాణీకులంద‌రూ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వేసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేక‌పోతే రైల్వే ప్రయాణం చేయ‌నివ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ప్ర‌తీ రైల్వే కార్మికుల‌కు టీకాలు వేసేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. టీకా వేసుకోక‌పోతే రైల్వే స్టేష‌న్ లోకి ప్ర‌వేశం క‌ల్పించ‌బోమ‌ని తెలిపింది. అలాగే ప్ర‌తీ కార్మికుడు, ఉద్యోగి మాస్క్ త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేక‌పోతే ఫైన్లు కూడా వేస్తామ‌ని చెప్పింది. మాస్క్ వేసుకోకుండా స్టేష‌న్‌కు వ‌స్తే రూ.500 ఫైన్ వేస్తామ‌ని చెప్పింది. ఈ నిబంధ‌న‌లు ఇప్ప‌టికే అమ‌లు చేస్తోంది రైల్వే శాఖ   అందులో భాగంగా ఇప్ప‌టికే కొన్ని రైల్వే స్టేష‌న్ల‌లో విస్తృత త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. ప్రయాణికులు పాటించాల్సిన కొత్త నిబంధ‌న‌లను ప్ర‌యాణికుల‌కు తెలిసేలా అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో విస్తృతంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్లేక్సీలు క‌ట్టి ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌తీ ఒక్క ప్ర‌యాణికుడు మాస్క్ ధ‌రించాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్తోంది. టీకా వేసుకోవాల‌ని సూచిస్తోంది. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కోరుతోంది. 

ఓమ్రికాన్ పేషెంట్ల‌కు స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇవ్వండి- రాష్ట్రాల‌కు సూచించిన కేంద్రం

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇప్ప‌టికే అమ‌లు..
రైల్వే శాఖ కంటే ముందే తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల్లో మాస్క్ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. మాస్క్ ధ‌రించ‌క‌పోతే బ‌స్సు ప్ర‌యాణం చేయ‌నివ్వ‌బోమ‌ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి క‌రోనా వ్యాప్తి అడ్డుకోవ‌డానికి కృషి చేయాల‌ని కోరారు. ఓమ్రికాన్ విస్తరిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ సామాజిక  బాధ్య‌త‌గా మాస్క్ ధ‌రించాల‌ని కోరారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఈ నిబంధ‌న క‌చ్చితంగా అమ‌లుజ‌రుగుతుంద‌ని చెప్పారు. మాస్క్ లేక‌పోతే ప్ర‌యాణం నిరాక‌రిస్తామ‌ని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios