ఓమ్రికాన్ పేషెంట్లకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వండి- రాష్ట్రాలకు సూచించిన కేంద్రం
ఓమ్రికాన్ వేరియంట్ భయటపడిన కరోనా పేషెంట్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.
ఓమ్రికాన్ పేషెంట్లకు కరోనా డెల్టా వేరియంట్ పేషెంట్ల కంటే ప్రత్యేకంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఓమ్రికాన్ బాధితల కోసం స్పెషల్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. వారి నుంచి ఇతర పేషెంట్లకు, వైద్య సిబ్బందికి ఓమ్రికాన్ సోకకుండా జాగ్రత్త వహించాలని చెప్పింది.
రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు
విదేశాల నుంచి వచ్చిన పేషెంట్ల నమూనాలు పంపించాలి
ఓమ్రికాన్ లిస్టులో చేరిన దేశాల నుంచి, లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్ల వివరాలను పంపించాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకే రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్ల నమూనాలను జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం ఇన్సాకోగ్ కు పంపించాలని అన్నారు. బాధితులతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను వెంటనే గుర్తించాలని సూచించారు. వారిని క్వారంటైన్ లో ఉంచి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు పెంచాల్సి ఉంటుందని అన్నారు. అప్పుడే ఓమ్రికాన్ వేరియంట్ ను గుర్తించవచ్చని అన్నారు. 5 శాతం కంటే కరోనా కేసులు పెరిగిన జిల్లాలో తప్పకుండా కరోనా టెస్ట్‌లను పెంచాలని ఆదేశించింది. ఇతర దేశాల నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చే ప్రయాణికులందరి వివరాలను ఆయా ప్రభుత్వాలు సేకరించుకోవాలని సూచించారు. వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని అన్నారు. కరోనా పేషెంట్లతో మాట్లాడటానికి ఈ సంజీవనీ వేధికను ఉపయోగించుకోవాల్సిందిగా పేషెంట్ల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కరోనాపై, మాస్కు వినియోగం, భౌతికదూరంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
11 శాతం పెరిగిన కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం నిన్నటి కరోనా కేసులతో పోల్చితే మళ్లీ ఈరోజు కరోనా కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఈరోజు 11 శాతం కరోనా కొత్త కేసులు భయటడ్డాయని ప్రభుత్వం తెలిపింది. దేశం మొత్తం మీద గడిచిన 24 గంటల్లో 9,419 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేరళాలో ఒకే రోజు 5038 కేసులు భయటపడగా 35 మంది కరోనాతో చనిపోయారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 404 కొత్త కేసులు భయటపడగా ఒకరు మృతి చెందారు. ఓమ్రికాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 21 కొత్త వేరియంట్ కేసులు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 5న గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే 17 ఓమ్రికాన్ కేసులు భయటపడ్డాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లోనే ఎక్కువ ఓమ్రికాన్ వేరియంట్ కేసులు భయటపడ్డాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.