Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువే .. జ‌పాన్ సైంటిస్టులు ఎమ‌న్నారంటే?

Omicron: న‌వంబ‌ర్ ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా హహ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పై  ఇప్ప‌టికీ పూర్తి స‌మాచారం లేదు. అయితే, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా అంచ‌నాలున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే నాలుగు రెట్లు అధికంగా వ్యాపిస్తుంద‌ని గురువారం నాడు జ‌పాన్ ప‌రిశోధ‌కుల బృందం పేర్కొంది. 

Omicron Four Times More Transmissible Than Delta in New Study
Author
Hyderabad, First Published Dec 9, 2021, 4:35 PM IST

omicron variant: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ భ‌యాందోళ‌న‌లు కొన‌సాతున్నాయి. ఈ వేరియంట్ సంబంధించిన పూర్తి స‌మాచారం అందుబాటులో లేదు.  ఒమిక్రాన్ ప్ర‌భావం, వ్యాధి తీవ్ర‌త, వ్యాప్తి వంటి అంశాల‌పై ఇప్పుడిప్పుడే ప‌లు దేశాల్లో ప‌రిశోధ‌న‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, ప్రాథ‌మికంగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఒమిక్రాన్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా వైద్య నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనిలో అధికంగా ఉన్న స్పైక్ మ్యూటేషన్ల కార‌ణంగా వ్యాప్తి, ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని పలువురు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీనికి తోడు ఈ వేరియంట్ వెలుగుచూసిన ద‌క్షిణాఫ్రికాలో ప్ర‌స్తుతం రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల్లో 70 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులు ఉంటున్నాయ‌ని అక్క‌డి అధికారులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ ఆ దేశంలో క‌రోనా ఫోర్త్ వేవ్ కు కార‌ణ‌మైంద‌ని నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. దీంతో ఒమిక్రాన్ పై భ‌యాందోళ‌న‌లు అధిక‌మ‌వుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా దేశాల ఒమిక్రాన్‌పై ప‌రిశోధ‌న‌ల‌ను ముమ్మ‌రం చేశాయి.

Also Read: Telangana: తెలంగాణాలో పెరిగిన ఆత్మహత్యలు.. NCRB నివేదికలో షాకింగ్ విష‌యాలు !

 

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌ల బృందం ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌పై  జపాన్‌ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో కొత్త అంశం వెల్లడైంది. ఒమిక్రాన్‌ ప్రారంభ దశలో.. డెల్టా వేరియంట్‌ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్న‌ట్టు ప‌రిశోధ‌కులు గుర్తించారు. జ‌పాన్‌లోని  క్యోటో విశ్వవిద్యాలయంలో ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న Hiroshi Nishiura దక్షిణాఫ్రికా గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యు సమాచారాన్ని విశ్లేషించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బృందం ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా క‌న్నా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని ఈ బృందం పేర్కొంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించ‌డంతో పాటు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అందిస్తున్న క‌రోనా ర‌క్ష‌ణ నుంచి సైతం ఒమిక్రాన్ త‌ప్పించుకోగ‌లుగుతుంద‌న్నారు. 

Also Read: Ponnala Lakshmaiah: లోపల దోస్తీ.. బయట కుస్తీ !

Hiroshi Nishiura బృందం ఒమిక్రాన్ జ‌న్యుక్ర‌మంపై జ‌రిపిన పూర్తి స‌మాచారం  వివరాలు ఆ దేశ ప్రభుత్వానికి  వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను గురువారం నాడు జపాన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స‌ల‌హా మండ‌లికి అందించారు.  ఆ దేశ ఆరోగ్య శాఖ స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్న Hiroshi Nishiura.. గ‌ణిత సూత్రాల ఆధారంగా ఈ నివేదిక‌ను త‌యారు చేశారు. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ..  ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే.. ద‌క్షిణాఫ్రికాలో క‌రోనా వ్యాక్సినేష‌న్ రేటు 30 శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి స‌హ‌జంగానే వైర‌స్ బారినప‌డే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే, వ్యాక్సినేష‌న్ రేటు అధికంగా ఉన్న యూకే, అమెరికా వంటి దేశాల్లోనూ ఈ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, వ్యాక్సిన్ రేటు అధికంగా ఉన్న దేశాల్లో ఏ స్థాయిలో విజృంభిస్తుంద‌నేది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అన్నారు. ఈ అంచ‌నాల‌కు రావ‌డానికి మ‌రింత డేటా రావాల్సి ఉంద‌ని అన్నారు.  అప్పటివరకు జాగ్రత్తు తీసుకోవడం, దీనిపై పరిశోధనలు చేయడం ముఖ్యమని అన్నారు. 

Also Read: Omicron Variant: మహారాష్ట్రలో కోలుకున్న ‘ఒమిక్రాన్‌’ బాధితుడు

Also Read: Coronavirus:పెరుగుతున్న కరోనా కొత్త కేసులు.. 11.6 శాతం అధికం

Follow Us:
Download App:
  • android
  • ios