ఆందోళనకరంగా కరోనా కొత్త వేరియంట్... జాగ్రత్త: రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరిక
తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ కేసులు యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూడా అప్రమత్తమయ్యింది.
న్యూడిల్లి: గత రెండేళ్ళుగా యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరో రూపం దాల్చినట్లు బయటపడింది. దక్షిణాఫ్రికాలో ‘బి.1.1.529’రకం కొత్త కరోనా వేరియంట్ బయటపడటం ఆ దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ బి.1.1.529 వేరియంట్ కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు దక్షిణాఫ్రికా వ్యాప్తంగా 22 నమోదయినట్లు... క్రమేపీ new corona variant ఉదృతమవుతోందని దక్షిణాఫ్రికా వైద్యశాఖ ప్రకటించింది.
బి.1.1.529 కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విదేశాల నుండి మరీ ముఖ్యంగా south africa తో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల నుండి భారత్ కు విచ్చేసే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా వుండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. ఈ మేరకు union health department secretary రాజేశ్ భూషణ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసారు.
బి.1.1.529 కరోనా వేరియంట్ ప్రమాదకరంగా మారి మరోసారి ప్రజారోగ్యంపై సవాల్ విసిరే ప్రమాదముందని ఈ లేఖ ద్వారా రాష్ట్రాలకు హెచ్చరించారు. కాబట్టి ఈ వేరియంట్ బయటపడిన దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు పట్ల అలసత్వం వద్దని... క్షుణ్ణంగా అన్నిరకాల corona tests జరపాలని సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల నమూనాల కోసం పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బి.1.1.529 కరోనా వేరియంట్ ను ఇండియాలో ప్రవేశించనివ్వకుండా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
read more తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా: ఆసుపత్రిలో చేరిక
కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అంతేకాదు రోగ నిరోధక శక్తిపై కూడా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ వేరియంట్ వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు. ఇక్కడి నుండి వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఇక ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు అతి తక్కువవగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 9,119 కరోనా కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాబారిన పడ్డవారి సంఖ్య 3,45,44,882కు చేరింది. కరోనా పాజిటివిటీ రేటు 0.79 శాతంగా వుంటే రికవరీ రేటు 98.33 శాతంగా వుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 1,09,940గా వుంది. తాజాగా 396 మంది కరోనాతో మృతి చెందినట్లు... దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,66,980కు చేరుకుందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
read more Covaxin: కరోనా లక్షణాలకు వ్యతిరేకంగా కొవాగ్జిన్ ప్రభావం 50 శాతం.. వెల్లడించిన తాజా అధ్యయనం.. కానీ..
తెలంగాణ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 33,836 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
ఇదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,75,148 చేరుకుంది. 6,67,631 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,531 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణంతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య చేరుకుంది.