తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా: ఆసుపత్రిలో చేరిక

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి వివాహమైంది

Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy tested Corona positive

హైదరాబాద్: Telangana Assembly స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని  పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.ఈ నెల 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి వివాహం జరిగింది. ఈ వివాహనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తన మనమరాలి పెళ్లిని స్పీకర్ Pocharam Srinivas Reddy ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హల్ లో  ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి  ఏపీ సీఎం Ys jagan, తెలంగాణ సీఎం Kcr సహా రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రెండు రాష్ట్రాలకు చెందిన  అధికారులు హాజరయ్యారు.  

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత ఈ పెళ్లిలోనే రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కలుసుకొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఇద్దరు సీఎంలు  నూతన వధూవరులను ఆశీర్వదించారు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. అయితే తన మనమరాలి పెళ్లి సందర్భంగా పలువురు హాజరయ్యారు అయితే ఎవరి నుండి Corona సంక్రమించిందో తెలియదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన వివరించారు.  వైద్యుల సూచనల మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  ఇటీవలనే ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుకరోనా సోకింది. కరోనా సోకడంతో విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో  బిశ్వభూషన్ హరిచందన్  హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత ఆయన హైద్రాబాద్ నుండి ఆయన తిరిగి విజయవాడకు చేరుకొన్నారు.

also read:ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 264 మందికి పాజిటివ్.. కృష్ణా జిల్లాలో అత్యధికం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. కరోనా కేసుల వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు.  రాష్ట్రంలో విద్యా  సంస్థలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నుండి తెరిచారు. అయితే విద్యా సంస్థల్లో కోవిడ్ ప్రోటోకాల్  పాటిస్తున్నారు.  మరో వైపు ఇటీవల కాలంలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో కరోనా కేసులు నమోదయ్యాయి.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో  కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. కరోనా సోకిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్  డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసుల వ్యాప్తి చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఆయన బుధవారం నాడు తెలిపారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టాయి. అయితే కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదౌతున్న కేసుల్లో మెజారిటీ కేరళ రాష్ట్రం నుండే నమోదౌతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios