Asianet News TeluguAsianet News Telugu

‘కాలా చష్మా’ పాటకు నవ వధువు డ్యాన్స్.. నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్

ఓ నవవధువు సంగీత్ లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలా చష్మా పాటకు ఆమె వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

New bride dancing to the song 'Kaala Chashma'.. Netizens' fida.. Video viral
Author
First Published Nov 26, 2022, 1:58 PM IST

పెళ్లి అంటేనే వేడుక. ఇందులో సరదాలు, సంబరాలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. ఇటీవల పెళ్లిళ్ల కల్చర్ మొత్తం మారిపోయింది. పాత కాలంలో మాదిరిగానే ఐదు రోజుల వివాహం చేసుకుంటున్నారు. అయితే పాత పద్దతిలో కాదు. నయా ట్రెండ్ కు తగ్గట్టు కొన్ని రోజుల పాటు సాగుతోంది. ఇందులో సంగీత్, హల్దీ, పెళ్లి, రిషెప్షన్ అంటూ ఇలా రకరకాల వేడుకలు ఏర్పాటు చేస్తూ ఆనందంగా జరుపుకుంటున్నారు. 

ప్రతి పౌరుడికి న్యాయం అందాలి.. కోర్టుల వద్దకు ప్రజలు కాదు.. ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలి: సీజేఐ

ఈ సంగీత్ లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ఇటీవల మాములు అయిపోయింది. అయితే ఓ వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లకు ఆహ్లాదం పంచుతోంది. పెళ్లి కూతురు ‘కాలా చష్మా’పాటకు వేసిన స్టెప్పులకు సోషల్ యూజర్లు ఫిదా అవుతున్నారు. 

కొత్త యాంకర్ కు లైన్ వేస్తున్న జబర్థస్త్ టాప్ కమెడియన్..? సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మల్లెమాల..?

ఈ వైరల్ వీడియోలో లెహంగా ధరించిన వధువు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఆ వీడియో పై ‘నేను మొదట సిగ్గు పడుతున్నాను కానీ’ అని టెక్ట్స్ ఉంది. న్యూ బ్రైడ్ డైరీస్ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఇది పోస్ట్ అయ్యింది. ఈ వీడియోను 1.7 మిలియన్లకు పైగా వీక్షించారు. ఆమె డ్యాన్స్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లవ్లీ, సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

చాలా మంది సోషల్ మీడియా యూజర్లకు ఈ వీడియో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతోంది. ఇంత ఎనర్జిటిక్ వీడియోను ఎక్కడా చూడలేదని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు తాను పూర్తి వీడియో కోసం వెతుకుతున్నాను కానీ దొరకడం లేదని పేర్కొనగా.. మరొకరు పూర్తి వీడియో కచ్చితంగా కావాలని కామెంట్ చేశారు. మరి కొందరు పెళ్లి కూతురు సిగ్గు పడుతోందని పేర్కొన్నారు. 

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్.. ఈవోఎస్‌-06 ఉపగ్రహం సెపరేషన్ విజయవంతం..

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ పాకిస్థానీ అమ్మాయి చేసిన విన్యాసం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. లాహోర్‌కు చెందిన అయేషా అనే అమ్మాయి పెళ్లిలో ‘‘మేరా దిల్ యే పుకారే ఆజా’’ పాటకు డ్యాన్స్ చేసి రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios