Asianet News TeluguAsianet News Telugu

ప్రతి పౌరుడికి న్యాయం అందాలి.. కోర్టుల వద్దకు ప్రజలు కాదు..  ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలి: సీజేఐ 

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ..దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ.. పాత హామీలను నెరవేర్చేందుకు మనం ఎంతో కృషి చేయాల్సి ఉందన్నారు. న్యాయం అందరికీ అందాల‌ని, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే కోర్టులు వెళ్లాల‌ని, న్యాయం కోసం ప్ర‌జ‌లను కోర్టుల చుట్టూ తిరిగేలా చేయ‌కూడ‌ద‌ని అన్నారు. 

Chief Justice At Constitution Day Event Courts Must Reach Out To People
Author
First Published Nov 26, 2022, 1:15 PM IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శనివారం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను స్మరించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేసుకున్నారు. 'గతం ఇప్పటికీ మాకు కొంత వరకు అతుక్కుని ఉంది మరియు వాగ్దానాన్ని నెరవేర్చడానికి మేము చాలా చేయాల్సి ఉంటుంది' అని ఆయన అన్నారు. నేడు  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు సుప్రీంకోర్టులో చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు పాల్గొన్నారు. 

స్వాతంత్య్రానికి ముందు అణగారిన వర్గాల పోరాటాన్ని వివరిస్తూ.. ‘రాజ్యాంగానికి పునాది వేసిన మొదటి వ్యక్తి ఆయనే’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రధాన న్యాయమూర్తి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ప్రకటనను గుర్తు చేసుకోవాలని అన్నారు. న్యాయం అందరికీ అందాల‌ని, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే కోర్టులు వెళ్లాల‌ని, న్యాయం కోసం ప్ర‌జ‌లను కోర్టుల చుట్టూ తిరిగేలా చేయ‌కూడ‌ద‌ని అన్నారు.  

సుప్రీం కోర్ట్ తిలక్ మార్గ్‌లో ఉన్నప్పటికీ, ఈ దేశానికి ఇదే అత్యున్న న్యాయస్థానం..  ఇప్పుడు వర్చువల్ యాక్సెస్ ద్వారా న్యాయవాదులు వారి స్వంత ప్రదేశాల నుండి కేసులను వాదించడానికి అవకాశం వచ్చిందని అన్నారు. కేసుల లిస్టింగ్ విష‌యంలో టెక్నాల‌జీని ఆశ్ర‌యించాల‌ని సీజేఐ సూచించారు.  

 న్యాయవాదవృత్తి లో ఉన్నవారు మహిళలను, అట్టడుగు వర్గాలను మరింత ప్రోత్సహించాలని CJI నొక్కి చెప్పారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో కూడా అనేక సాంకేతిక మార్పులు వచ్చాయని, సాంకేతిక మౌళిక‌ సదుపాయాల్ని ధ్వంసం చేయ‌రాదని, ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.దేశంలో ఎన్నో రకాల సంస్కతి,  సంప్రదాయాలు ఎక్కువ.. కానీ, ఇలాంటివి మానవ హక్కుల కల్పనలో స‌వాళ్లు గా మారకూడదని అన్నారు. అంద‌రికీ న్యాయం అందేలా న్యాయ‌వ్య‌వ‌స్థ చూడాల‌ని, భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు అందరూ తోడ్పడాలని సీజేఐ తెలిపారు. వర్చువల్ కోర్టుల సౌకర్యాలను అంతం చేయవద్దని, ఈ మోడల్‌ను మరింత పటిష్టంగా మార్చాలని అన్ని హైకోర్టులను ఆయన కోరారు. 

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ-కోర్టుల ప్రాజెక్టు కింద వివిధ కొత్త కార్యక్రమాలు,వెబ్‌సైట్‌లను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ..'1949లో స్వ‌తంత్ర భార‌త‌దేశం త‌న‌కు తాను కొత్త భ‌విష్య‌త్తుకు పునాది వేసుకున్న ఈ రోజునే, భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈసారి రాజ్యాంగ దినోత్స‌వం కూడా ప్ర‌త్యేక మ‌ని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios