చండీగఢ్: హర్యానాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. 37 ఏళ్ల వయస్సు గల నేపాలీ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన యుమునానగర్ లోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గురువారం అర్థరాత్రి మాస్కులు ధరించి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. వారు మహిళ నివాసంలోకి చొరబడ్డారు. 

వరండాలో నిద్రిస్తున్న మహిళ భర్తను కట్టేశారు. మరో గదిలో నిద్రిస్తు్న మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ప్రతిఘటించడంతో ఐదో వ్యక్తి పారిపోయాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామని నిందితులు బెదిరించి వెళ్లిపోయారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. 

రాత్రి జరిగిన విషయాన్ని భార్యాభర్తలు తమ యజమానికి చెప్పారు. వారితో పాటు యజమాని పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఐదుగురిపై పోలీసుుల కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

మరో సంఘటన 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. బావనే ఆ యువతిపై అత్యాచారం చేశాడు. 

తన భర్త సోదరుడు తనపై అత్యాచారం చేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఒంటరిగా ఉన్న సమయం చూసి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.