Asianet News TeluguAsianet News Telugu

ఎన్ఈపీని ‘నాగ్‌పూర్ విద్యా విధానం’గా మార్చారు - కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

నూతన జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేయాలని అనుకుంటోందని కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. ఆ పార్టీ దేశ చరిత్రను మార్చాలని ప్రయత్నిస్తోందని అన్నారు. 

NEP changed to 'Nagpur education policy' - Karnataka Congress chief DK Shivakumar
Author
First Published Aug 30, 2022, 9:09 AM IST

నూనత జాతీయ విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థను ‘కాషాయం’ చేస్తోందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్రను మార్చాలని కోరుకుంటోందని అని అన్నారు. ఎన్ఈపీని ‘‘నాగపూర్ విద్యా విధానం’’ గా ఆయన అభివర్ణించారు. 

వైరల్ వీడియో : జిమ్ లో వధువు కసరత్తులతో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. అత్తింటివారికి చుక్కలే అంటున్న నెటిజన్లు..

2022 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా 20,000 అంగన్వాడీలు, పాఠశాలల్లో ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా (ప్రీ ప్రైమరీ స్టేజ్)లో ఎన్ఈపీ- 2020ని అమలు చేయనున్నట్లు గత వారం బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిందే. ఈ నేప‌థ్యంలోనే డీకే శివ‌కుమార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

కర్ణాటక ప్రభుత్వం భారత రాజకీయాల చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయ‌న ఆరోపించారు.‘‘ మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించారు. ఆయనను మాత్రమే నిజమైన మహాత్ముడు అని పిలుస్తాం. ప్రస్తుత ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని నాగపూర్ విద్యా విధానంగా మార్చింది! ఇది బుద్ధిహీనమైన ప్రభుత్వం ’’ అని డీకే శివకుమార్ అన్నారు. 

యూపీలో మతాంతర జంట హ‌త్య‌.. ముగ్గురి అరెస్ట్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తారని, వారి (బీజేపీ)విద్యావిధానం, రాజకీయ ఎజెండాను రద్దు చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. వారు తమ వ్యక్తిగత ఎజెండాతో నిండిన చరిత్రను మార్చాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా హడావుడిగా విద్యావిధానాన్ని అమలు చేస్తోందని ఆయ‌న గతంలోనూ విమర్శించారు.

మా అధికారులను వేధిస్తే బెంగాల్‌లోని సీబీఐ, ఈడీ అధికారులపై చర్యలు తీసుకుంటాం: మమత బెన‌ర్జీ

విద్య రాష్ట్ర అంశమని, దీనిపై రాష్ట్ర శాసనసభలో చర్చించాలని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది తల్లిదండ్రులలో ఆందోళనను, ఉపాధ్యాయులలో గందరగోళాన్ని కలిగించిందని తెలిపారు. విద్యార్థులను మతతత్వంలో ఇరికించడమే ఈ విధానం లక్ష్యమని ఆరోపిస్తూ.. ఎన్ఈపీని అమలు చేయాలనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంద‌ని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios