వైరల్ వీడియో : జిమ్ లో వధువు కసరత్తులతో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. అత్తింటివారికి చుక్కలే అంటున్న నెటిజన్లు..

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లో చిత్రవిచిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారే సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ఓ యువతి చేసిన ఇలాంటి ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. 

Viral Video : Bride works out at gym for pre-wedding shoot..Baahubali dulhan, says Internet..

తమిళనాడు : సోషల్ మీడియాలో ఇప్పుడొక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి పెళ్లికూతురిలా ముస్తాబయ్యి.. ఆ గెటప్ లోనే జిమ్ లో కసరత్తులు చేస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకుంది. దీన్ని ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంటనే ట్వీట్లు, రీట్వీట్లు.. షేర్స్, లైక్స్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బాహుబలి కోడలు అంటూ.. జమానా మారింది అంటూ కామెంట్ల వరద కొనసాగింది.

ఈ వీడియోను సంయుక్త అనే మరో ట్విట్టర్ యూజర్ షేర్ చేస్తూ.. ఇదేంటీ.. భర్త, అత్తింటివారికి క్లియర్ హెచ్చరికా??? అంటూ సరదా కామెంట్ చేస్తూ పోస్ట్ చేసింది. అంతే దీనిమీద కూడా కామెంట్ల వరద కొనసాగుతోంది. అఫ్ కోర్స్ నెగటివ్ కామెంట్స్ లేకపోతే అది సోషల్ మీడియానే కాదు.. వాటితో పాటు.. సరదాగా ‘అత్తింటివారి పని అయిపోయింది’.. ‘ఇక వారికి చుక్కలే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

'అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి కూర్చోవ‌డం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం'

ఇంతకీ ఈ వీడియో ఎక్కడిదంటే తమిళనాడులోది. తమిళనాడుకు చెందిన ఓ యువతి.. తన పెళ్లికి ముందు ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ ప్లాన్ చేసింది. దీనికి ఫోటో గ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు కూడా నవ్వుతూ, సరదాగానే స్పందించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల కల్చర్లో ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. మరి దీనిపై వరుడు ఎలా స్పందించాడో.. కాస్త పాతతరం, పట్టింపులు ఎక్కువగా ఉండే అత్తగారు అయితే.. వారెలా స్పందించేవారో.. కానీ ఇప్పటికైతే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios