మహారాష్ట్ర ఎన్సీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని బీజేపీ నాయకుడు వినాయక్ అంబేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మహారాష్ట్ర బీజేపీ నాయకుడు వినాయక్ అంబేకర్ పై ఎన్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆఫీసులోనే 20 మంది ఎన్సీపీ కార్యకర్తలు తనను కొట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోషల్ మీడియా పోస్ట్ కు క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ ఎంపీ గిరీష్ బాపట్ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.
‘‘ ఈ రోజు నాకు ఒక వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ట్యాక్స్ కు సంబంధించి కొన్ని సలహాలు కావాలని కోరాడు. ఓ 20 మందితో కలిసి నా ఆఫీసుకు వచ్చాడు. నన్ను చెంపదెబ్బ కొట్టాడు. నా కళ్ళజోడు విరిగిపోయింది. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ’’ అని అంబేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో కొందరు వ్యక్తులు పక్కన నిలబడి ఉండగా.. ఓ వ్యక్తి అంబేకర్ ను చెంపదెబ్బ కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.
వెల్లవిరిసిన సోదరభావం.. కుల్గాంలో మహిళా కాశ్మీర్ పండిట్ అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు
అంతకు ముందు పవార్ పై అవమానకరమైన పోస్ట్ చేసినందుకు అంబేకర్‌పై ఎన్‌సీపీ కార్యకర్త విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్సీపీ అధ్యక్షుడిపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అభ్యంతరకరమైన పోస్ట్ ను చేశారనే కారణంతో మరాఠీ నటి కేతకీ చితాలే కేసు నమోదైంది. దీంతో ఆమెను థానే పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె తన పోస్ట్‌లో మరాఠి నటి ‘‘హెల్ ఈజ్ వెయిటింగ్ ’’, ‘‘యూ హేట్ బ్రాహ్మిన్స్’’ వంటి పద బంధాలను ఉపయోగించారు. శరద్ పవార్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టినప్పటికీ ఎక్కడా ఆమె ఆయన పేరును ప్రస్తావించలేదు. అయితే 80 ఏళ్ల వ్యక్తి అని పరోక్షంగా ఆరోపించింది. దీంతో స్వప్నిల్ నెట్కే అనే వ్యక్తి ఫిర్యాదుతో థానేలోని కాల్వా పోలీస్ స్టేషన్‌తో పాటు మరో రెండు పోలీస్ స్టేషన్లలో నటి కేతకీ చితాలే కు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Assam flash floods : అస్సాంలో వరదల బీభత్సం.. ముగ్గురు మృతి.. 94 గ్రామాలపై ప్రభావం..
శనివారం సాయంత్రం నవీ ముంబైలోని కలంబోలి పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న చితాలేపై NCP మహిళా విభాగానికి చెందిన కార్యకర్తలు నల్ల ఇంక్, గుడ్లు విసిరారు. అయితే ఆమెపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153 (ఎ), 500, 505 (2) కింద కేసు నమోదు చేశారు. అలాగే.. నటుడు నిఖిల్ భామ్రేతో పాటు కేతకీ చితాలే పై పూణేలో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ పోస్టులపై మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ మంత్రి జితేంద్ర అవద్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.నటి కేత్కి చితాలే పోస్ట్‌పై మహారాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100-200 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయాలని పార్టీ కార్యకర్తలు ఆయన పిలుపునిచ్చారు. తమ నాయకుడిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎన్సీపీ కుటుంబానికి పితృమూర్తి అని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు.
