Asianet News TeluguAsianet News Telugu

వెల్ల‌విరిసిన సోద‌ర‌భావం.. కుల్గాంలో మ‌హిళా కాశ్మీర్ పండిట్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన ముస్లింలు

కుల్గాంలో మహిళా కాశ్మీర్ పండిట్ అంత్యక్రియలను స్థానిక ముస్లింలు హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. మృతురాలు నివ‌సించే ప్రాంతంలో హిందూ కుటుంబాలు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఆమె చివ‌రి అంకాన్ని ముస్లింలు బాధ్యతగా తీసుకున్నారు.

Spreading brotherhood .. Muslims officiating the funeral of women Kashmir Pandit in Kulgam
Author
Kulgam, First Published May 15, 2022, 12:55 PM IST

కాశ్మీరీ పండిట్, ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ హత్యకు గురికావడంతో జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణంలో నెలకొంది. అయితే ఈ తరుణంలో కాశ్మీర్ లోయలో సోదరభావం, మత సామరస్యం వెల్లువిరిసింది. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని త‌హ‌సీల్ ఆఫీసులో రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత, కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని వై కె పోరా గ్రామంలో 80 ఏళ్ల కాశ్మీరీ పండిట్ మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి ముస్లింలు, కాశ్మీరీ పండిట్‌లు ఒక్కటయ్యారు. .

వై కె పోరా గ్రామానికి చెందిన దివంగత జాంకీ నాథ్ భార్య దులారీ భట్ బంధువు వివాహానికి హాజరయ్యేందుకు అనంతనాగ్‌లోని మట్టన్‌కు వెళ్లింది. వివాహానికి హాజరైన ఆమె అస్వస్థతకు గురై అక్క‌డే చ‌నిపోయారు. అదే రోజు ఆమె స్వగ్రామమైన వై కె పోరాకు ఆమె మృత‌దేహాన్ని తీసుకొని వెళ్లాల్సివ‌చ్చింది. అక్కడ వందలాది మంది ముస్లింలు, ఆమె పొరుగువారు, స్థానికులు ఆమె మృతదేహం కోసం వేచి ఉన్నారు.

Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లపై దాడులు.. కేంద్రంపై ఫ‌రూక్ అబ్దుల్లా ఫైర్ !

వై కే పోరా ప్రాంతంలో చాలా త‌క్కువ సంఖ్య‌లో హిందూ కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో ఆమె అంత్యక్రియల ఏర్పాటు బాధ్య‌త‌ను స్థానిక ముస్లిం యువ‌త తీసుకుంది. చెక్క ముక్కలను తీసుకురావడం నుండి అంత్యక్రియలకు చితి ఏర్పాటు చేయడం వరకు, దులారి భ‌ట్ మృత‌దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి పేటికను తయారు చేయడం, పూల రేకులు, అగరబత్తులు అమర్చడం వరకు ముస్లింలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ కాశ్మీరీ పండిట్ కుటుంబానికి అన్ని విధాలుగా స‌హ‌క‌రించారు. ఆ వృద్ధురాలికి హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీడ్కోలు ప‌లికారు. 

తమ పండుగలు, పెళ్లిళ్లు నిర్వ‌హించిన‌ప్పుడు లేదా ఎవ‌రైనా చ‌నిపోయిన‌ప్పుడు దులారి స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లకు వ‌చ్చే వార‌ని స్థానిక ముస్లిం ఒకరు తెలిపారు. ‘‘ ఆమె మా గ్రామ  మిశ్రమ సంస్కృతిలో భాగం . నేడు ఆమె అంత్యక్రియలు వారి మతపరమైన ఆచారాల ప్రకారం నిర్వహించడం మా కర్తవ్యం. ’’ అని ఆయ‌న ఇండియా టుడేతో తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం చివ‌రి ద‌శ‌లో ఉంది - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించడంలో సహాయం చేసినందుకు, దుఃఖ సమయంలో త‌మ కుటుంబానికి అండగా నిలిచేందుకు దులారి భ‌ట్ కుమారుడు సుభాష్ కుమార్ భట్  స్థానిక ముస్లింలకు  ఆయ‌న కృతజ్ఞతలు ‘‘ నా తండ్రి 90వ దశకంలో హత్యకు గురయ్యాడు. అయినప్పటికీ మేము కాశ్మీర్ నుంచి పారిపోలేదు.మేము ముస్లిం సమాజంతో కలిసి జీవించాము ” అని ఆయ‌న చెప్పారు. 

ఇదిలా ఉండ‌గా.. రాహుల్ భ‌ట్ హ‌త్య కాశ్మీర్ లోయ‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘ‌ట‌న‌పై  ప్రతిపక్ష నాయకుల కూడా తీవ్రంగా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ హ‌త్య జ‌రిగిన ఒక రోజు తర్వాత 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ తమ రాజీనామాలను సమర్పించారు. రాహుల్ భట్ చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో క్ల‌ర్క్ గా ప‌ని చేసేవారు. ఆయ‌న 2010-11లో కాశ్మీరీ పండిట్ల వలసదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం ప్యాకేజీ కింద ఉద్యోగం పొందారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios