మహారాష్ట్రలో ఉల్లి రైతులు నిన్న ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. నాసిక్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ. 2కే కొనుగోలు చేశారని, దీన్ని క్వింటల్ ధర రూ. 1,500కు పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. తాజాగా, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిగడ్డల దండలను మెడలో వేసుకుని అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. ఉల్లిగడ్డలను తట్టల్లో నెత్తిమీద మోసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిగడ్డల దండను మెడలో వేసుకుని నిరసనలు చేశారు. బుట్టల్లో ఉల్లిగడ్డలను మోసుకుని మహారాష్ట్ర అసెంబ్లీకి ఉదయం చేరుకున్నారు. ఉల్లిగడ్డ హోల్ సేల్ ధరలు పడిపోవడాన్ని నిరసించారు. నాసిక్ జిల్లాలోని ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిగడ్డల మార్కెట్‌లో రైతులు ఉల్లిగడ్డలు అమ్మడానికి వచ్చి నిరసనలు చేశారు. నిన్న ఇక్కడ హోల్ సేల్ ధర కిలో ఉల్లిగడ్డలకు రూ. 2కు పడిపోయింది. దీంతో ఉల్లిగడ్డల అమ్మకాలను నిలిపేసి ధర్నా చేశారు.
నిన్న మార్కెట్‌లో రైతులు నిరసనలు చేశారు. ఈ రోజు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉల్లిగడ్డలను తట్టల్లో తలపై మోసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఉల్లిగడ్డల టోకు ధరలు పడిపోవడంపై నిరసనలు చేశారు. ఉల్లిగడ్డల హోల్ సేల్ ధరలను పెంచి రైతులకు అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాసిక్‌లోని లాసల్‌గావ్ మండీలో నిన్న ఉల్లిగడ్డ రైతులు ఆందోళనలు చేశారు. ఇక్కడ కిలో ఉల్లిగడ్డ ధరరూ. 4 నుంచి రూ. 2కు పడిపోయిందని వారు ఆరోపణలు చేశారు. క్వింటల్ ఉల్లి ధరను రూ. 1500లుగా వెంటనే గ్రాంట్ చేయాలని ఉల్లి రైతులు డిమాండ్ చేశారు. లేదంటే.. ఇక్కడ ఉల్లి కొనుగోళ్లు జరగనివ్వబోమని హెచ్చరించారు.
ఇక్కడ నిన్న క్వింటల్ ఉల్లికి రూ. 200 పలికిందని, అంటే.. కిలోకు రూ. 2 మాత్రమే ఉన్నదని తెలిపారు. గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 800 పలికిందని, కానీ, సగటును రూ. 400 నుంచి రూ. 450గానే ఉందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తప్పకుండా క్వింటల్ ఉల్లి ధరను రూ. 1,500గా ప్రకటించాలని ఉల్లి సాగు యూనియన్ నేత భరత్ దిఘోలే తెలిపారు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో రైతులను కలిపిస్తామని మంత్రి దాదా భూసా హామీ ఇవ్వడంతో రైతులు నిరసనలు ముగించారు. ఈ రోజు ఉదయం రెగ్యులర్ ఆక్షన్స్ మొదలయ్యాయని వివరించారు.
