ప్రధాన మోడీతో ప్రతిపక్ష నేత శరద్ పవార్ వేదిక పంచుకున్నారు. పూణెలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన శరద్ పవార్ వద్దకు మోడీ నేరుగా వచ్చి మాట్లాడారు. శరద్ పవార్ కూడా ఆయనతో ఆప్యాయంగా మాట్లాడారు.
ముంబయి: విపక్షాల కూటమిలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రముఖ నేత. ఆ కూటమి రూపుదాల్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఎన్డీయే, ఇండియా కూటములు ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్ హింస విషయమై ఈ రెండు కూటముల మధ్య వాదనలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఈ సందర్బంలో ఇండియా కూటమిలో కీలక సభ్యుడైన శరద్ పవార్, ప్రధాని మోడీతో వేదిక పంచుకున్నారు. అంతేకాదు, వేదిక మీద వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్న దృశ్యాలు చర్చనీయాంశమవుతున్నాయి. విపక్ష పార్టీలు వద్దని విజ్ఞప్తి చేసినా శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.
పూణెలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ వెళ్లారు. వేదిక పైకి వచ్చిన ప్రధాని మోడీ నేరుగా శరద్ పవార్ వద్దకు వెళ్లారు. ఆయనతో నవ్వుతూ మాట్లాడారు. ప్రధాని మోడీ భుజంపై చేయి వేస్తూ శరద్ పవార్ కూడా అనునయంగా మాట కలిపారు. ఇదే వేదికపై శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని చీలి వెళ్లిన అజిత్ పవార్ కూడా కూర్చుని ఉన్నారు. ప్రధాని మోడీ శరద్ పవార్‌ను కలిసిన తర్వాత అజిత్ పవార్‌ను కలిశారు. అజిత్ పవార్ భుజం తడుతూ మాట్లాడారు.
Also Read: గుజరాత్ అల్లర్లపై వాజ్‌పేయి పార్లమెంటులో మాట్లాడారు: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
మోడీ హాజరు కాబోతున్న ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని విపక్ష పార్టీలు శరద్ పవార్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా.. అజిత్ పవార్ పార్టీ చీల్చినప్పుడు వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టాలని సూచించాయి. కానీ, శరద్ పవార్ ఖాతరు చేయలేదు. కొన్ని నెలల క్రితం ఈ కార్యక్రమం కోసం తానే ప్రధాని మోడీని ఆహ్వానించానని శరద్ పవార్ వివరించారు. కాబట్టి, తాను ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండబోనని ముందే స్పష్టం చేశారు.
విపక్ష కూటమిక ిసంబంధించిన కసరత్తు పూర్తి చేసుకోవడానికి ఆ పార్టీలు మూడోసారి ముంబయిలో సమావేశం కావాల్సి ఉన్నది.
