ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి ప్రతిభావంతులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల వల్లే శరద్ పవార్ కు ప్రధాని అయ్యే అవకాశం రాలేదని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల కారణంగానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కు ప్రధాని అయ్యే అవకాశం దక్కలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్రలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఎంపీలతో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. బంధుప్రీతి కారణంగానే కాంగ్రెస్ శరద్ పవార్ తో పాటు చాలా మంది ప్రతిభావంతులను ప్రోత్సహించలేదని విమర్శించారు.

ఈసారి ఇంజన్లు ఫెయిల్ అయినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది - ఇస్రో చీఫ్ సోమనాథ్

శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ తో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత ఎన్సీపీ నిలువునా చీలిపోయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తరువాత జరిగిన పరిణామల్లో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. 

కాగా.. ప్రధాని ఈ సమావేశంలో శివసేనపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘ఎలాంటి కారణం లేకుండా వివాదాలు సృష్టించారు. కానీ మేం భరించాం. కొన్నిసార్లు మేము దానిని తేలికగా తీసుకున్నాం. ఓ వైపు అధికారంలో ఉండాలని, మరోవైపు విమర్శలు చేయాలనుకుంటున్నారు. ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయి’’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

మహిళా పోలీసుకే వేధింపులు.. 300 సార్లు కాల్ చేసి.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి..

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై బిజెపి, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత శివసేన బీజేపీతో సంబంధాలు తెంచుకుని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిన అమర్ నాథ్ యాత్ర

అనంతరం ప్రధాని మోడీ.. జేడీ(యూ)ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్డీయే కూటమిలో తమ మిత్రపక్షాలే ముఖ్యమని, అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని తెలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (74) తో పోలిస్తే జేడీ (యూ) తక్కువ సీట్లు (43) పొందినప్పటికీ.. నితీష్ కుమార్ సీఎం అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీకి కాంగ్రెస్‌ మాదిరిగా అహంకారం లేదని, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.