ఓ అకతాయి ఏకంగా మహిళా పోలీసు అధికారి వెంటే పడ్డాడు. తన లైంగిక కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. ఏకంగా 300 సార్లు కాల్స్ చేసి ఆమెను విసిగించాడు. దీంతో ఆమె తన పోలీసు ప్రతాపం అతడిపై చూపెట్టింది. ఇంతకీ ఏం చేసిందంటే ?
మహిళపై ఆకతాయిల వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అయితే సాధారణ మహిళలకే కాదు.. కొందరు మహిళా పోలీసులకు కూడా ఈ బాధ తప్పడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఓ ఆకతాయి ఏకంగా మహిళా పోలీసు అధికారి కాల్ చేసి వేధింపులు చేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 300 సార్లు ఆమెకు ఫోన్ చేశాడు. అది కూడా ఆమె పర్సనల్ నెంబర్ కు కాదు.. ఆమె అధికారిక నెంబర్ కే కాల్స్ చేసేవాడు. చివరికి ఏం జరిగిందంటే ?
కేరళలో ఓ మహిళా పోలీసు అధికారికి వింత అనుభవం ఎదురైంది. కొచ్చిన్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఆమెకు కొన్ని రోజుల నుంచి ఓ ఆకతాయి ఫోన్ చేస్తున్నాడు. అది కూడా ఆమె అధికారిక నెంబర్ కు చేసి మరీ సతాయిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని వెంబడిస్తున్నాడు. ఇలా ఏకంగా 300 సార్లు ఆమెకు కాల్స్ చేశాడు. మొదట్లో పోనీలే అని వదిలేసిన ఆ అధికారి.. అతడి ఆగడాలు ఎక్కువ కావడంతో చివరికి తన పోలీసు ప్రభావం చూపెట్టింది.
పదే పదే కాల్స్ చేసి విసిగించడంతో ఆమె విసిగిపోయి.. ఆకతాయికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అంత సేపు వాడిని తిడుతూ ఫోన్ కట్ చేసే ఆమె.. ఒక్క సారిగా అతడితో తీయగా మాట్లాడటం మొదలుపెట్టింది. అతడు ఉండే ప్రదేశం తెలుసుకొని, అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుంది. అనంతరం మంగళవారం ఎర్నాకులం కోర్టులో ఆ ఆకతాయిని ప్రవేశపెట్టింది.
తనపై జరిగిన వేధింపులను ఆమె సాక్షాధారాలతో సహా కోర్టులో నిరూపించింది. దీంతో కోర్టు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.15 వేల ఫైన్ వేసింది. ఐపీసీతో పాటు, కేరళ పోలీసు యాక్ట్ ప్రకారం తీర్పు వెలువరించింది.
